హడావుడిగా నీళ్లు తాగుతున్నారా...?
నిలబడి నీళ్లు తాగుతున్నారా? హడావుడిగా నీళ్లు తాగుతున్నారా? ఇకపై అలా తాగకండి. నీరు తాగేటప్పుడు కూర్చుని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే శరీరంలో అన్ని భాగాలకు, కణాలకు, కండరాలకు నీరు సమంగా అందుతుంది. మూత్రపిండాలు కూడా కూర్చుని తాగినపుడు సమర్థవంతంగా పనిచేస్తాయి.
నిలబడి తాగినపుడు ఎక్కువ శాతం నీరు ఎముకల కీళ్లలో చేరిపోయి ఆర్థరైటిస్ కలిగించే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే నీటిని ఒకేసారి మొత్తంగా తాగడం మంచిది కాదు. నీళ్లు తాగుతున్నపుడు కూడా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా తాగడం మంచిది.
చల్లని నీరు తాగకూడదు. గోరువెచ్చని నీటిని అప్పుడప్పుడు తాగడం చేయాలి. చల్లని నీరు తాగడం వల్ల జీర్ణక్రియ, రక్తప్రసరణ వ్యవస్థల పనితీరు మందగిస్తుంది. అలా కాకుండా కాస్త వేడిగా వున్న నీరు.. లేదా గోరు వెచ్చగా ఉండే నీరు తాగడం వల్ల రక్తనాళాల శుద్ధి, కొవ్వు పదార్థాలు తొలగిపోతాయి. ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా దాహం వేసినప్పుడు నీటిని తాగాలని వైద్యులు చెప్తున్నారు.