ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By JSK
Last Updated : గురువారం, 22 సెప్టెంబరు 2016 (09:46 IST)

మునగ ఆకుతో 300 వ్యాధులకు దూరం...అవేంటో తెలుసుకుందాం...

మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే. అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య యోజనాలున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి. మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల

మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే. అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య యోజనాలున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి. మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు వుండవు. అలాగే కాల్షియం, పాస్పరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా వుంటాయి. అసలు 4, 5 వేల ఏళ్ల నుంచే మన పూర్వీకులు మునగాకును మెడిసిన్ తయారీలో వినియోగిస్తున్నారంటే ఆ ఆకు గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది. ఆయుర్వేదంలో 300లకు పైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు.
 
* మునగాకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ ఎని పది రెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందొచ్చు. కళ్ల వ్యాధులకు సంబంధించిన మెడిసిన్‌లో మునగాకును వాడతారు.
* పాల నుంచి లభించే క్యాల్షియం 17 రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది. 
* పెరుగు నుంచి పొందే ప్రోటీన్లను 8 రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు.
* అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం 15 రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చు.
* మహిళలు రోజుకి 7 గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్‌గా తీసుకుంటే 13.5 శాతం బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గాయని పరిశోధనల్లో తేలింది.
 
* థైరాయిడ్‌ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునగాకు.
* మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తుందట.
* మునగాకుల రసాన్ని పాలలో కలపి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి. 
* గర్భిణులు, బాలింతలకు ఇస్తే వారికి అవసరం అయిన కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తల్లులతోపాటు, పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా వుంటారు. 
 
* పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి. 
* గుప్పెడు మునగాకులను వంద మిల్లీలీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్థమా, టీబీ, దగ్గు తగ్గుతాయి.
* మునగాకు రసం ఒక చెమ్చా తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరినీళ్ళలో కలిపి, కాస్తంత తేనె కలిపి ఇస్తే విరోచనాలు తగ్గిపోతాయి. 
* మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయి.
 
* ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రదాయిని. అలాంటి వారు విరివిగా మునగాకును ఏదో ఒక రూపంగా ఉపయోగిస్తూ ఉంటే వారిలోని కాల్షియం పెరుగుతుంది. 
* వందగ్రాముల మునగాకులో వుండే పోషక పదార్థాలు.. నీరు 75.9 శాతం, పిండి పదార్థాలు 13.4 గ్రా, ఫ్యాట్స్ 17 గ్రాములు, మాంసకృత్తులు 6.7 గ్రా, కాల్షియం 440 మిల్లీ గ్రా, పాస్పరస్ 70 మిల్లీ గ్రా, ఐరన్ 7 మిల్లీ గ్రా, 'సి’ విటమిన్ 200 మి .గ్రా, ఖనిజ లవణాలు 2.3 శాతం,పీచు పదార్థం 0.9 మి గ్రా,ఎనర్జీ  97 కేలరీలు ఉంటాయి.