డ్రీమ్ టెక్నాలజీ సరికొత్త X60 అల్ట్రా కంప్లీట్ రోబో వాక్యూమ్ విడుదల
స్మార్ట్ హోమ్ ఆవిష్కరణలలో ప్రపంచ అగ్రగామి డ్రీమ్ టెక్నాలజీ, భారతదేశంలో తన ఫ్లాగ్‌షిప్ డ్రీమ్ X60 అల్ట్రా కంప్లీట్ రోబో వాక్యూమ్‌ను విడుదల చేస్తున్నట్లు ఈరోజు ప్రకటించింది. ఇది డ్రీమ్కు చెందిన అత్యంత సన్నని రోబోట్ వాక్యూమ్, ఈ విభాగంలోనే అత్యధిక సక్షన్ సామర్థ్యం కలిగి ఉంది. ఇది మరింత తెలివైనదిగా, అనుకూలమైనదిగా, స్వతంత్రంగా ఉండేలా రూపొందించిన ఈ పరికరం కొత్తతరం సంపూర్ణ గృహ శుభ్రత అందిస్తుంది. డ్రీమ్ X60 అల్ట్రా కంప్లీట్ తన పరిసరాలు అర్థం చేసుకోవడానికి, ఇతర రోబోలు చేరుకోలేని ప్రదేశాలకు చేరుకోవడానికి, సవాళ్లతో కూడిన అడ్డంకులు అధిగమించడానికి, నిజ సమయంలో తన శుభ్రపరిచే విధానాన్ని మార్చుకునేలా రూపొందించబడింది. డ్రీమ్ X60 అల్ట్రా కంప్లీట్, రూ. 1,34,999లకు సెప్టెంబర్ 27, 2026 నుంచి అమెజాన్ ఇండియాలో, సెప్టెంబర్ 22, 2026 నుండి డ్రీమ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. ఇది క్రోమా, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కూడా లభిస్తుంది.
డ్రీమ్ టెక్నాలజీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను శర్మ మాట్లాడుతూ, “ఇంటెలిజెంట్ హోమ్ టెక్నాలజీ పరిణామంలో మనం ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాము. ఇక్కడ దృష్టి, యంత్రాలు ఏమి చేయగలవనే దాని నుంచి, అవి తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎంత తెలివిగా అర్థం చేసుకుని, ప్రతిస్పందించగలవనే దానిపైకి మారుతోంది. డ్రీమ్ X60 అల్ట్రా కంప్లీట్ రోబోట్ వాక్యూమ్‌తో మేము ఈ ఆలోచనకు జీవం పోస్తున్నాము. AI-ఆధారిత గుర్తింపు, అడాప్టివ్ నావిగేషన్, అధునాతన క్లీనింగ్ టెక్నాలజీల ద్వారా రోబో ఇంట్లో కదులుతున్నప్పుడు మరింత సమర్థవంతమైన పనితీరు అందించేలా ఇది వీలు కల్పిస్తుంది.
ఇది ఒక భవిష్యత్తును ప్రతిబింబిస్తుంది, గృహ సాంకేతికత కేవలం ఆటోమేటెడ్ మాత్రమే కాకుండా, మరింత సహజంగా, అందిపుచ్చుకునేలా ఉంటూ రోజువారీ జీవితాన్ని మరింత సులభతరం చేయడానికి రూపొందించబడింది. వినియోగదారులు తమ ఇళ్లను శుభ్రపరిచే విధానంతో మొదలుపెట్టి, భవిష్యత్తును వారికి ఆచరణాత్మకంగా, సులభంగా అనిపించేలా చేయడమే మా లక్ష్యం. మా ఈ కొత్త ఆవిష్కరణతో మేము స్మార్ట్ లివింగ్ భవిష్యత్తులోకి అడుగుపెడుతున్నాము.”
ఈ ఆవిష్కరణ డ్రీమ్ “లివ్ స్మార్టర్” తత్వానికి కొనసాగింపుగా ఉంది. డ్రీమ్ టెక్నాలజీ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ కృతి సనన్ తాజా ప్రచారం ద్వారా ఈ తత్వానికి జీవం పోస్తున్నారు. ఇంటెలిజెంట్ హోమ్ టెక్నాలజీ వినియోగదారుల రోజువారీ ఇంటి పనులను ఎలా సులభతరం చేస్తుందో, తద్వారా వారికి ముఖ్యమైన అనుభూతులు. క్షణాలపై దృష్టి పెట్టడానికి ఎక్కువ సమయం ఎలా లభిస్తుందో ఈ ప్రచారం వివరిస్తుంది. డ్రీమ్ X60 అల్ట్రా కంప్లీట్‌తో ఇంటిని శుభ్రపరచడంలో మరింత స్వయంప్రతిపత్తి విధానం ద్వారా ఈ ఆశయం నిజమవుతుంది. ఇది ఇంటి పనుల నిర్వహణకు తక్కువ సమయం వెచ్చించి, తమ జీవితాలు ఆస్వాదించడానికి ఎక్కువ సమయం కేటాయించేలా వినియోగదారులకు వెసులుబాటు కల్పిస్తుంది.
అత్యంత సన్నని రోబో వాక్యూమ్, మరింత పనిచేసే డిజైన్
కేవలం 7.95 సెం.మీ. మందంతో, డ్రీమ్ X60 అల్ట్రా కంప్లీట్ అనేది డ్రీమ్ వారి అత్యంత సన్నని రోబో వాక్యూమ్. ఇది మంచాలు, సోఫాలు, క్యాబినెట్‌ల కింద ఉండే ఇరుకైన ప్రదేశాలును చేరుకునేలా రూపొందించబడింది. దీని రిట్రాక్టబుల్ DToF సెన్సార్ విశాలమైన ప్రదేశాలలో 360° స్కానింగ్ కోసం పైకి లేస్తుంది, ఇరుకైన ప్రదేశాలలో దానంతట అదే వెనక్కి వెళ్ళిపోతుంది. దీని బైనాక్యులర్ ఆబ్‌స్టాకిల్ అవాయిడెన్స్ సిస్టమ్ రెండు AI కెమెరాలు ఉపయోగించి 280కి పైగా వస్తువులను గుర్తించి, వాటిని తప్పిస్తుంది.
ఇది ఫర్నిచర్ కింద ఉన్న ప్రదేశాలకే పరిమితం కాదు. డ్యూయల్ ఫ్లెక్స్ ఆర్మ్ టెక్నాలజీ, సైడ్ బ్రష్, మాప్ ప్యాడ్‌లను ఇరుకైన మూలలు, చేరుకోలేని ప్రదేశాలలోకి విస్తరింపజేస్తుంది. సవాలుతో కూడిన ప్రదేశాలలో 100% వరకు శుభ్రపరిచే కవరేజీని అందించడంలో ఇది సాయపడుతుంది.
డ్రీమ్ X60 అల్ట్రా కంప్లీట్ అడ్డంకులను అధిగమించే డ్రీమ్ ఫ్లెక్సీఅడాప్ట్ వ్యవస్థను కూడా పరిచయం చేస్తుంది. ఇది 4.2 సెం.మీ వరకు ఒకే పొర, 8 సెం.మీ వరకు రెండు పొరలు దాటేలా రూపొందించబడింది. ఇది ఇంట్లో మరింత సవాలుతో కూడిన మార్పులను నావిగేట్ చేయడానికి, వివిధ ప్రాంతాలలో మరింత నిరంతరాయమైన శుభ్రపరిచే మార్గాన్ని కొనసాగించేందుకు రోబోకు వీలు కల్పిస్తుంది. ఈ సాంకేతికతలన్నీ కలిసి డ్రీమ్ X60 అల్ట్రా కంప్లీట్‌కు తక్కువ స్థలాన్ని వదిలేస్తూ, ఇంటిలో ఎక్కువ భాగాన్ని శుభ్రపరిచే ఒక సులభమైన లక్ష్యాన్ని అందిస్తాయి.
ఈ విభాగంలో అత్యధిక సక్షన్ శక్తి, లోతైన శుభ్రత కోసం రూపొందించినది
ప్రతి మూలకు చేరుకోవడం పనిలో ఒక భాగం మాత్రమే. డ్రీమ్ X60 అల్ట్రా కంప్లీట్ తన తెలివైన నావిగేషన్‌ను శక్తిమంతమైన సక్షన్ శక్తితో జతచేసి, మరింత లోతైన, క్షుణ్ణమైన శుభ్రత అందిస్తుంది. రోబో వాక్యూమ్ విభాగంలో అత్యధిక సక్షన్ శక్తి 35,000Pa వోర్మాక్స్ సక్షన్ శక్తితో, డ్రీమ్కు చెందిన ఈ ప్రధాన ఉత్పత్తి, ప్రెజర్‌స్ట్రీమ్ డిటాంగ్లింగ్ డ్యూయోబ్రష్ సిస్టమ్ 2.0, వెనక్కి తీసుకోగల ప్రెజర్ ఛాంబర్‌తో కలిసి అసాధారణమైన శుభ్రపరిచే శక్తి అందిస్తుంది.
గట్టి నేలలు, కార్పెట్లు రెండింటి కోసం రూపొందించిన ఈ సిస్టమ్, మురికి, చెత్త పట్టుకోవడంతో పాటు, రోబో క్లీనింగ్‌లో అత్యంత మొండి సవాళ్లలో ఒకటైన జుట్టు చిక్కులు కూడా పరిష్కరిస్తుంది. డ్యూయోబ్రష్ సిస్టమ్, వివిధ రకాల నేల ఉపరితలాలపై లోతైన శుభ్రపరిచే పనితీరు కొనసాగిస్తూనే, జుట్టు చిక్కులు తగ్గించేలా తయారుచేయబడింది. దుమ్ము దులపడం కంటే శుభ్రపరచడం ముఖ్యం అనుకునే ఇళ్ల కోసం, డ్రీమ్ X60 అల్ట్రా కంప్లీట్ దాని 100°C థర్మోహబ్ మాప్ సెల్ఫ్-క్లీనింగ్ సిస్టమ్‌తో పరిశుభ్రత ప్రమాణాలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. 100°C వరకు ఉష్ణోగ్రత గల నీటిని ఉపయోగించి, ఈ సిస్టమ్ మాప్ ప్యాడ్‌లను నానబెట్టి, లోతుగా శుభ్రపరుస్తూ జిడ్డు, మొండి మరకలు తొలగించడంలో సాయపడుతుంది, అదే సమయంలో శుభ్రపరిచే చక్రాల మధ్య కూడా మాప్ ప్యాడ్‌లను శుభ్రంగా ఉంచుతుంది.
వాక్యూమింగ్ నుంచి నిజమైన సంపూర్ణ గృహ శుభ్రత వరకు
డ్రీమ్ X60 అల్ట్రా కంప్లీట్ కేవలం వాక్యూమ్, మాప్ చేయడానికి మాత్రమే కాకుండా, తక్కువ మానవ ప్రమేయంతో మరింత సంపూర్ణమైన శుభ్రపరిచే వ్యవస్థ అందించడానికి రూపొందించబడింది. దీని థర్మల్ మాప్ ప్యాడ్‌లు, ఉష్ణోగ్రతను 40°C కంటే ఎక్కువగా ఉంచుతాయి, 230RPM డ్యూయల్ ఓమ్ని-స్పిండిల్ మోటార్‌తో రుద్దే మాపింగ్, 15N దిగువకు ఒత్తిడి, ఇల్లంతా తీవ్రమైన స్క్రబ్బింగ్ పనితీరు అందించడానికి రూపొందించబడ్డాయి. వేడినీటి మాపింగ్, అధిక-వేగ స్క్రబ్బింగ్, దిగువకు ఒత్తిడి కలయిక, రోజువారీ మురికి, ఒలికినవి, మొండి మరకలు మరింత సమర్థవంతంగా తొలగించడంలో రోబోకు సాయపడతాయి.
అడాప్టివ్ డర్ట్ డిటెక్షన్, ఇంటెలిజెంట్ నావిగేషన్, విస్తరించే క్లీనింగ్ మెకానిజమ్స్, ఆటోమేటెడ్ మాప్ మెయింటెనెన్స్ కలిసి పనిచేయడంతో, X60 అల్ట్రా కంప్లీట్, ఇంటి మొత్తానికి అడాప్టివ్ క్లీనింగ్ అనే డ్రీమ్ ఆలోచనకు జీవం పోస్తుంది. ఈ రోబో కేవలం ముందుగా సెట్ చేసిన రొటీన్‌ను అనుసరించడానికి బదులుగా, స్వతంత్రంగా మరిన్ని క్లీనింగ్ నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కల్పిస్తుంది.
మీరు గమనించని మురికి కూడా గుర్తిస్తుంది
డ్రీమ్ X60 అల్ట్రా కంప్లీట్ నేలపై వాస్తవంగా ఏమి జరుగుతుందో దానికి అనుగుణంగా క్లీనింగ్ ఉండేలా రూపొందించబడింది. సెలెస్ట్ లైటింగ్‌తో కూడిన దీని AI ఓమ్నిడర్ట్ డిటెక్షన్ టెక్నాలజీ, పెంపుడు జంతువుల వెంట్రుకలు, సన్నని కణాలు, తేలికపాటి ద్రవాలు సహా చూడటానికి కష్టంగా ఉండే మురికిని ప్రకాశవంతం చేస్తుంది, తద్వారా రోబో వివిధ రకాల మురికి గుర్తించి, నిజసమయంలో దాని క్లీనింగ్ విధానం మార్చుకునేలా వీలు కల్పిస్తుంది.
రెండు 120° అధిక కచ్చితత్వ కెమెరాలు, వెర్సాలిఫ్ట్ నావిగేషన్‌తో కూడిన AI-ఎన్‌హ్యాన్స్డ్ ఓమ్నిసైట్™ సిస్టమ్ ద్వారా ఈ ఇంటెలిజెన్స్ మరింత బలోపేతం చేయబడింది. అప్‌గ్రేడ్ చేసిన ఈ సిస్టమ్, ప్రతిస్పందన మెరుగుపరచడానికి, అడ్డంకులు మరింత కచ్చితంగా తప్పించుకోనేలా రూపొందించబడింది. ఇది డ్రీమ్ X60 అల్ట్రా కంప్లీట్ తన పరిసరాలు మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి, తిరగడానికి సాయపడుతుంది. రోబో కోసం ఇంటిని సిద్ధం చేయాల్సిన అవసరం లేకుండా, ఇంటిని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన శుభ్రపరిచే అనుభూతి లభిస్తుంది.
ఆఫ్టర్ సేల్స్ సర్వీసులు, వారెంటీ
డ్రీమ్ X60 అల్ట్రా కంప్లీట్ ఒక సంవత్సరం వారంటీతో పాటు భారతదేశవ్యాప్తంగా 160కి పైగా నగరాల్లో విస్తరించి ఉన్న డ్రీమ్ ఆఫ్టర్-సేల్స్ సర్వీస్ నెట్‌వర్క్ కలిగి ఉంది. దీని ధర రూ.1,34,999. వినియోగదారులు ప్రత్యేక మద్దతు సేవలు పొందడం సహ ఎంపిక చేసిన ప్రదేశాలలో పికప్, డ్రాప్ సాయం, ఇన్‌స్టాలేషన్ సహకారం పొందవచ్చు. X60 అల్ట్రా కంప్లీట్‌తో పాటు వినియోగదారులు రోజువారీ ఇంటి పనులు సులభతరం చేయడానికి, ఇంటిని శుభ్రపరచడం మరింత సౌకర్యవంతంగా చేయడానికి రూపొందించిన రోబోటిక్ వాక్యూమ్‌లు, కార్డ్‌లెస్ స్టిక్ వాక్యూమ్‌లు, వెట్-అండ్-డ్రై వాక్యూమ్‌లు సహా డ్రీమ్ విస్తృత శ్రేణి స్మార్ట్ క్లీనింగ్ సొల్యూషన్‌లను కూడా పరిశీలించవచ్చు
