శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 9 ఆగస్టు 2019 (06:00 IST)

పాక్ కు అజిత్ దోవల్ కౌంటర్

జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్తాన్ ఇండియాపై విషం చిమ్ముతోంది. అంతర్జాతీయ కోర్టులో కంప్లైంట్ చేస్తామనడమే గాకుండా..  ఇండియాతో  వాణిజ్య ఒప్పందాలను కూడా రద్దు చేసుకుంది. అలాగే పాకిస్థాన్ లో ఇండియన్ సినిమాలను బ్యాన్ చేసింది. ఇండియా పాక్ ల మధ్య నడిచే సంఘౌతా ఎక్స్ ప్రెస్ ను సరిహద్దులో నిలిపివేసింది.

అయితే దీనికి అంతే ధీటుగా ఇండియా నుంచి కౌంటర్లు పడుతున్నాయి. పాకిస్థాన్ ఇండియాతో సంబంధాలను తెంచుకోవడం వల్ల ఇండియా కంటే పాకిస్తాన్ కే ఎక్కువ నష్టమంటూ ఏకిపడేస్తున్నారు. లేటెస్ట్ గా భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ పాకిస్థాన్ కు ట్విట్టర్లో దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు.

అవును పాక్ ఇండియాతో వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకుంటే ఎంత నష్టం వస్తుందంటే.. వీరాట్ కొహ్లీ ఇన్ స్టాగ్రామ్ లో ప్రమోషనల్ పోస్ట్ పెడితే ఎంత తీసుకుంటాడో అంత నష్టం అంటూ కౌంటర్ చమత్కరించారు. ఇండియా కంటే పాక్ ఎక్కువ నష్టపోతుందని అన్నారు అజితో దోవల్.