శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 9 ఆగస్టు 2019 (05:58 IST)

ప్రణబ్ ముఖర్జీ భారతరత్న

2019వ సంవత్సారానికి గాను భారతరత్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగింది. మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీతో పాటు నానాజీ దేశ్‌ముఖ్, భూపేన్ హజారికాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ భారతరత్న అవార్డులను అందజేశారు.
 
ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా కేంద్రమంత్రులు, రాజకీయ నేతలు హాజరయ్యారు. 1935లో జన్మించిన ప్రణబ్ ముఖర్జీ కరడుగట్టిన కాంగ్రెస్‌వాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
 
 ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ కేబినెట్‌లలో మంత్రిగా, 2012 నుంచి 2017 వరకు భారత రాష్ట్రపతిగా ఆయన దేశానికి సేవలందించారు. ఇక అస్సాంకి చెందిన భూపేన్ హజారికా కవి, సంగీతకారుడు, గాయకుడు, జర్నలిస్ట్, దర్శకుడిగా సేవలందించారు.

2011 నవంబర్ 5న ఆయన కన్నుమూశారు. ఇక నానాజీ దేశ్‌ముఖ్ జనసంఘ్‌లో కీలకపాత్ర పోషించారు. 1999-2005 మధ్యకాలంలో రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. భారతరత్న అవార్డు పొందిన రాష్ట్రపతులు రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, వీవీ గిరి సరసన ప్రణబ్ ముఖర్జీ కూడా చేరారు.