1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. At least 16 killed in attack on mosque in Pakistan

పాకిస్థాన్‌ మసీదులో ఆత్మాహుతి బాంబు దాడి.. 16మంది మృతి.. పలువురికి గాయాలు

Pakistan
Pakistan
పాకిస్థాన్‌లోని ఓ మసీదులో ఆత్మాహుతి బాంబు దాడి కలకలం రేపింది. వాయువ్య పాకిస్థాన్‌లోని కోహట్ జిల్లాలో పోలీసు లైన్స్ సమీపంలో ఉన్న ఒక మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో జరిగిన శక్తివంతమైన ఆత్మాహుతి బాంబు దాడిలో కనీసం 16 మంది మరణించగా, డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారని అధికారులు తెలిపారు. 
 
ఖైబర్ పఖ్తుంఖ్వా రాజధాని పెషావర్ నగరానికి నైరుతి దిశలో సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోహట్ జిల్లాలోని పాత పోలీసు లైన్స్ సమీపంలో ఈ పేలుడు సంభవించిందని వారు పేర్కొన్నారు. 
 
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని కోహట్ పోలీసు లైన్స్ వద్ద శుక్రవారం ప్రార్థనల సమయంలో జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో ఐదుగురు పోలీసులు, 11 మంది పౌరులతో సహా కనీసం 16 మంది మరణించారని ఆ ప్రాంత పోలీసు చీఫ్ జుల్ఫికర్ హమీద్ తెలిపారు. ఈ దాడికి ఏ సంస్థ లేదా వ్యక్తి బాధ్యత వహించలేదు. 
 
పేలుడు తర్వాత 50 మందికి పైగా గాయపడినవారితో పాటు 15 మృతదేహాలను ఆసుపత్రికి తరలించినట్లు జిల్లా ప్రధాన ఆసుపత్రి తాహిర్ అలీ షాను ఉటంకిస్తూ జియో న్యూస్ నివేదించింది. 
 
గాయపడిన వారిలో ఎక్కువ మంది ప్రార్థనలో ఉన్నవారేనని పోలీసులు తెలిపారు. అలాగే, ఈ పేలుడు కారణంగా మసీదు బయట ఒక పెద్ద గుంట (క్రేటర్) ఏర్పడిందని వారు పేర్కొన్నారు. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిలో చాలా మందిని ప్రాథమిక వైద్య చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
హనీమూన్‌లో విషాదం - బార్బెక్యూలో మంటలు.. మహిళకు తీవ్ర గాయాలు (వీడియో)