1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Committed To Properly Resolve Standoff With India In Ladakh: China

లడఖ్ సమస్యను పరిష్కరించేందుకు సిద్ధం - చైనా ప్రకటన

Ladakh
Ladakh
కరోనా మహమ్మారి చైనాలో పుట్టడంతో ఇప్పటికే ప్రపంచ దేశాలు డ్రాగన్ దేశంపై గుర్రుగా వున్నాయి. ఈ నేపథ్యంలో భారత్-చైనాల మధ్య వున్న లడఖ్ సమస్యను పరిష్కరించేందుకు డ్రాగన్ కంట్రీ సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు భారత్-చైనా మధ్య నెలకొన్న లడఖ్ ప్రతిష్టంభనను పరిష్కరించడానికి తాము చిత్తశుద్ధితో ఉన్నామని శుక్రవారం చైనా ప్రకటించింది. 
 
సరిహద్దు సమస్యలపై శనివారం జరగనున్న మిలటరీ స్థాయి అధికారుల సమావేశానికి ఒక రోజు ముందు చైనా ఈ ప్రకటనను వెలువరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతానికైతే భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితి స్థిరంగా, అదుపులోనే వుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ తెలిపారు. 
 
సైన్యం, దౌత్యపరమైన మాధ్యమాలున్నప్పటికీ...తాము ఎప్పటిలాగానే సమాచారాన్ని చేరవేస్తున్నామని చెప్పారు. అలాగే సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు తాము చిత్తశుద్ధితో కట్టుబడి వున్నామని తెలిపారు.  
తర్వాతి కథనం
కరోనా పనిభారంతో ఆంబులెన్స్ డ్రైవర్ మృతి, మెడలో తాళి కుదువబెట్టి అంత్యక్రియలు చేసిన భార్య