సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వి
Last Modified: శనివారం, 30 మే 2020 (18:33 IST)

భారత భూగంలోకి ప్రవేశించాలనుకున్న చైనా, అడ్డుకున్న భారత సైన్యం

భారత అంతర్భూభాగంలోకి చైనా సైన్యం ప్రవేశించాలని ప్రయత్నించింది. ఈ విషయాన్ని గుర్తించిన భారత సైన్యం అడ్డుకున్నది. ఈ విషయంలో ఎయిర్ ఫోర్స్ వెంట దళాలు భారత సైన్యానికి సహాయకారిగా నిలబడ్డాయి. చైనా ప్రయత్నాన్ని తిప్పికొట్టి చొరబాట్లను సమర్థవంతంగా అడ్డుకుంది.
 
భారత అంతర్భాగమైన లడఖ్ సరిహద్దు ప్రాంతంలో చైనా తన సైన్యంతో తిష్ట వేసేందుకు ప్రయత్నించింది. అక్కడికి చేరుకున్న భారత సైన్యం తమ భూభాగాన్ని రక్షించుకునేందుకు చైనా స్థావరాలను ఏర్పాటు చేయకుండా అడ్డుకుంది. మే నెల మొదటి వారంలో భారత దళాలు తమ నియంత్రణ రేఖ వద్ద వారిని అడ్డుకుని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.