సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 మే 2020 (10:14 IST)

దేశంలో విజృంభిస్తోన్న కరోనా వైరస్.. 24 గంటల్లో అన్ని కేసులా?

చైనాలో పుట్టిన కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తోంది. ఈ వైరస్‌కు మందు లేకపోవడంతో.. ఏం చేయాలో అర్థంకాక చాలా దేశాలు నివ్వెరబోతున్నాయి. ఇక కరోనా ధాటికి మన దేశం అల్లాడుతోంది. మొదట్లో కేసులు తక్కువగా ఉన్నప్పటికీ.. ఇపుడు విపరీతంగా పెరుగుతున్నాయి. 
 
గత 24 గంటల్లో 7964 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్కరోజు వ్యవధిలో నిర్ధారణ అయిన కేసుల్లో ఇదే అత్యధికం కావడం. దీంతో తాజాగా కేసుల సంఖ్య 1,73,763కు పెరిగింది. 
 
ఇక కొత్తగా మరో 265 మంది మృతిచెందడంతో మృతుల సంఖ్య 4,971కి చేరింది. ఇక రాష్ట్రాలవారీగా చూస్తే అత్యధికంగా మహారాష్ట్రలో 62,228 కేసులు, తమిళనాడులో 20,246, ఢిల్లీలో 17,386, గుజరాత్‌లో 15,934 కేసులు నిర్ధారణ అయ్యాయి.