ఆంధ్రాలో కొనసాగుతున్న వైరస్ వ్యాప్తి .. మరో 33 కొత్త కేసులు

apcorona
ఠాగూర్| Last Updated: శుక్రవారం, 29 మే 2020 (17:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఫలితంగా శుక్రవారం కూడా మరో 33 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,638 నమూనాలు పరీక్షించగా, అందులో 33 మందికి కరోనా నిర్ధారణ అయినట్టు తేలింది. ఈ కేసులతో కలుపుకుని మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,874కి చేరింది.

కాగా, రాష్ట్రంలో కొత్తగా వచ్చిన వాటిలో 6 కేసులకు కోయంబేడు లింకు ఉన్నట్టు గుర్తించారు. చిత్తూరు జిల్లాలో 4, నెల్లూరు జిల్లాలో 2 కేసులు వెలుగుచూశాయి. శుక్రవారం 79 మంది డిశ్చార్జి కావడంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,037కి పెరిగింది.

మరోవైపు, ప్రస్తుతం ఆసుపత్రుల్లో 777 మంది చికిత్స పొందుతున్నారు. ఇక, గడచిన 24 గంటల్లో కర్నూలులో ఒక కరోనా మరణం సంభవించింది. దాంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 60 మంది కరోనాతో మృత్యువాత పడినట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన వైద్య బులిటెన్‌లో పేర్కొంది.దీనిపై మరింత చదవండి :