తమిళనాడులో కొత్తగా 874 కరోనా కేసులు.. 20వేల మార్కును దాటేసింది..!

tamil nadu
tamil nadu
సెల్వి| Last Updated: శుక్రవారం, 29 మే 2020 (19:36 IST)
కరోనా కేసులు తమిళనాడులో పెరిగిపోతున్నాయి. శుక్రవారం కొత్తగా 874 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. గత కొన్ని రోజుల నుంచి 700కి పైబడిన కేసులే రోజూ నమోదు అవుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20వేల మార్కును దాటి 20 వేల 246కు చేరుకుంది.

ఇప్పటివరకు 11,313 మంది వైరస్ బారి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. తమిళనాడులో ప్రస్తుతం 8,776 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక శుక్రవారం మరో తొమ్మిది మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 154కు చేరింది.

తమిళనాడులో శుక్రవారం నమోదైన 874 కరోనా కేసులలో 733 మంది తమిళనాడు నివాసితులే కావడం గమనార్హం. మిగతా 141 మంది వివిధ రాష్ట్రాల నుంచి స్వరాష్ట్రానికి తిరిగొచ్చిన వారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. వారిలో మహారాష్ట్ర నుంచి 135 మంది, కేరళ నుంచి ముగ్గురు, తెలంగాణ, కర్ణాటక, పశ్చిమబెంగాల్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.దీనిపై మరింత చదవండి :