1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Coronavirus reaches the US: Everything we should know about the deadly virus

చైనాను వణికిస్తున్న వైరస్ భారత్‌లోకి వ్యాపించిందా?

China
చైనాను వణికిస్తున్న కొత్తరకం కరోనా వైరస్‌ 5 దేశాలకు పాకింది. థాయ్‌లాండ్‌, జపాన్‌, దక్షిణ కొరియా, తైవాన్‌, ఆస్ట్రేలియాకు చెందిన ఏడుగురు ఆ వైరస్‌ బారినపడినట్టు సమాచారం. వైరస్‌ కారణంగా చైనాలో ఆరుగురు మృతి చెందగా 300 మందికి వైరస్‌ సోకిందని అధికారులు ధ్రువీకరించారు. 
 
జంతువుల నుంచి మాత్రమే మనుషులకు సోకే ఈ వ్యాధి ఇప్పుడు మనుషుల నుంచి మనుషులకు కూడా సోకుతున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో దీన్ని అంతర్జాతీయ ఆరోగ్య అత్యయిక స్థితిగా ప్రకటించడంపై బుధవారం భేటీ కానున్నట్టు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. 
 
కాగా, వైరస్‌ ముప్పు నేపథ్యంలో భారత పౌర విమానయాన శాఖ అప్రమత్తమైంది. చైనా, హాంకాంగ్‌ నుంచి వచ్చే ప్రయాణికులను స్కానింగ్‌ చేసేందుకు హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు సహా దేశంలోని 7ప్రధాన విమానాశ్రయాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. అంటే భారత్‌లోకి ఈ వైరస్ వ్యాపించకుండా కేంద్ర ఆరోగ్య శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. 
తర్వాతి కథనం
తిరుమలలో ఫిబ్రవరి 1న రథసప్తమి వేడుకలు - భారత్‌కు బ్రెజిల్ ప్రెసిడెంట్