మీరైనా చెప్పండి సామీ..చినజీయర్ స్వామిని కలిసిన ఆర్టీసీ నేతలు

jeeyar
ఎం| Last Updated: బుధవారం, 30 అక్టోబరు 2019 (18:38 IST)
ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వానికి సూచించాలని రాష్ట్ర ఆర్టీసీ ఐకాస నేతలు చినజీయర్ స్వామీజీని కోరారు. రాజేంద్రనగర్లోని ముచ్చింతల్లోని ఆశ్రమానికి వెళ్లి ప్రస్తుత పరిస్థితులను స్వామీజికి వివరించారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి సూచన చేయాలని కోరుతూ... రాష్ట్ర ఆర్టీసీ ఐకాస నేతలు చిన జీయర్ స్వామిని కోరారు.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ముచ్చింతల్‌లోని స్వామిజీ ఆశ్రమానికి 300 మంది ఆర్టీసీ కార్మికులతో వెళ్లారు. సమ్మెకు దారి తీసిన పరిస్థితులను స్వామిజీకి వివరించారు. ప్రభుత్వ వైఖరి కారణంగా కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
దీనిపై మరింత చదవండి :