శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 30 అక్టోబరు 2019 (18:18 IST)

ఉద్యోగాలు ప్లీజ్... గవర్నర్ కు జేఏసీ నేతల విజ్ఞప్తి

నిరుద్యోగ సమస్యపై గవర్నర్  తమిళి సై సౌందర్ రాజన్ ను కలిసిన  ఓయు జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, అధ్యక్షులు ఎల్చల దత్తాత్రేయ రాష్ట్రంలో నెలకొన్న వివిధ సమస్యల మీద దాదాపు గంటన్నర వరకు సుదీర్ఘంగా చర్చించిన విద్యార్థులు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థుల పాత్ర, అమరుల ఆత్మబలిదానాలు విద్యార్థుల జైలు జీవితాలు కళ్లకు కట్టిన వివరించారు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నినాదమే నీళ్ళు,నిధులు, నియామకాలతో ప్రారంభమైందని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైన 2009 నుండి నేటి వరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల అధ్యాపకుల మరియు విశ్వవిద్యాలయాలలో ఖాళీ గా ఉన్న అధ్యాపక ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగ యువకులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

 2014 జూన్ 2న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి ఉద్యమ నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరున్నర సంవత్సరాలుగా ఏ ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయకుండా నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమవుతున్నాడని ఆవేదన వ్యక్తపరిచారు.

ఉద్యమ ప్రారంభం నుంచి నేటి వరకు పదకొండు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులంతా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు డిగ్రీ కళాశాలలు పాలిటెక్నిక్ కళాశాల విశ్వవిద్యాలయ అధ్యాపకుల ఉద్యోగాల కోసమే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాటం చేశామని గవర్నర్ గారికి వివరించారు.
 
గవర్నర్ ముందు ఉంచిన విద్యార్థుల డిమాండ్స్
- రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3 మూడు లక్షల పై చిలుకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తు టీఎస్పీఎస్సీ ద్వారా ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలి
 
- 2008 నుండి జెఎల్ 2012నుండి   డీఎల్ నోటిఫికేషన్లు లేక ప్రభుత్వ జూనియర్,డిగ్రీకాలేజీల విద్యా ప్రమాణాలు పడిపోతున్నవి.

- ఖాళీ గా ఉన్న 5171 జేఎల్,2657డీఎల్,581పిఎల్,140 ప్రభుత్వ బీఎడ్ కళాశాలల అధ్యాపకులు,192 డిఎడ్ కళాశాలల అధ్యాపకులు,విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న1528 పైచిలుకు ఆచార్యుల ఉద్యోగాలకు తక్షణం నోటిఫికేషన్ విడుదల చేయాలి.
 
- ప్రైవేటు విశ్వవిద్యాలయాల జీవో నంబర్ 17 ను తక్షణం రద్దు చేసి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలి.
- బ్లాంక్ గ్రాంట్ కింద ప్రతి విశ్వవిద్యాలయానికి 1000 కోట్లు కేటాయిస్తు,తక్షణం ప్రతి విశ్వవిద్యాలయానికి ఉపకులపతులను నియమించాలి
 
- జాతీయ ఉపకార వేతనాల్లో ఎస్సీ విద్యార్థులకు నెట్ తప్పనిసరి నిబంధనను తొలగిస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రికి మరియు యుజిసికి లేఖ రాయాలి 
 
- తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ జాతీయ ఉపకార వేతనాలను కేటాయిస్తూ ఎస్సీ,ఎస్టీ,ఒబిసి,మైనారిటీ  ల శ్లాబ్స్ పెంచాలి.
 
- ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన వారిపై చర్యలు తీసుకుని వారి కుటుంబాలకు పది లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించాలి.
 
- ప్రాథమిక ,మాధ్యమిక ,ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ ఉద్యోగాలను తక్షణం భర్తీ చేయాలని డిమాండ్ చేసారు.
 
- ప్రతిజిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులను నిర్మించి ఉచిత వైద్యాన్ని అందించాలి. పురాతన ఆసుపత్రులైన ఉస్మానియా, గాంధీ, నిమ్స్, ఎయమ్స్ ఆసుపత్రులలో వైద్య ప్రమాణాలను పెంచి నూతన భవనాలను నిర్మించాలి.
 
- రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధితో మరణించిన ప్రతి రోగి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకుంటూ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలి 
 
- రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తు,రైతు బంధు నిధులను తక్షణం విడుదల చేయాలి.
 
 
- 1998 నుండి భర్తీ చేయని ప్రభుత్వ బీఎడ్, డైట్ కళాశాలల అధ్యాపకులకు తక్షణం నోటిఫికేషన్ విడుదల చేయాలి.
 
- ఈ రాష్ట్రంలో సగటు మానవుని సంపద 80 నుండి 90% విద్య వైద్యానికే ఖర్చవుతుందని ఈ రెండు రంగాలను ప్రభుత్వమే ఉచితంగా అందిస్తూ...కార్పొరేట్ ఆస్పత్రులను స్కూళ్లను ఈ రాష్ట్రంలో రద్దు చేయాలి.
 
పై విషయాలన్నింటిపై సుదీర్ఘంగా చర్చించిన విద్యార్థులతో గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ సానుకూలంగా మాట్లాడుతూ సంబంధిత అధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేస్తానని తెలియజేశారు.

గవర్నర్ ని కలిసిన వారిలో విద్యార్థి జెఎసి నాయకులు టీఎస్ జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, ఓయూ జేఏసీ అధ్యక్షులు ఎల్చల దత్తాత్రేయ,పియు జెఎసి చైర్మన్ గొడుగు ప్రకాష్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధ్యక్షులు వెంకటేశ్ చౌహాన్,కేయు నాయకలు తిరుమలేష్,చిరంజీవి బెస్త,వంశీ,నవీన్ తదితరులు పాల్గొన్నారు.