శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 22 జనవరి 2020 (13:02 IST)

తిరుమలలో ఫిబ్రవరి 1న రథసప్తమి వేడుకలు - భారత్‌కు బ్రెజిల్ ప్రెసిడెంట్

తిరుమల తిరుపతి లోరథసప్తమి వేడుకలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న వేడుకలు ప్రారంభం కానున్నాయి. పర్వదినం రోజున ఏడు వాహనాలపై మాడ వీధుల్లో శ్రీవారిని ఊరేగించనున్నారు. రథసప్తమి ఏర్పాట్లను TTD అధికారులు సమీక్షిస్తున్నారు. రథసప్తమి రోజున అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు చెప్పారు. అంతేకాదు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.
 
రిపబ్లిక్ డే వేడుకల ముఖ్య అతిథిగా బ్రెజిల్ అధ్యక్షుడు......
భారత రిపబ్లిక్ డే వేడుకలకు ప్రతి ఏడాది విదేశీ అతిథులు హాజరు అవుతుంటారు. ఈ వేడుకల కోసం ఇండియా వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సారి జరిగే 71వ గణతంత్ర వేడుకలకు బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ మెసియాస్ బోల్సోనారో హాజరు కానున్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీ చేరుకోనున్నారు. రిపబ్లిక్ డే వేడుకలకు బ్రెజిల్ నేతలు ముఖ్య అతిథిగా హాజరు కావడం ఇది మూడోసారి.