బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 28 డిశెంబరు 2019 (21:40 IST)

టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులు

తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులు ను పాలక మండలి నియమించింది.

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మాత్రమే వైకుంఠ దర్శనానికి నిర్ణయించింది. జమ్మూకాశ్మీర్‌, వారణాసిలో శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు నిర్ణయించింది. ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం రూ.30 కోట్లు మంజూరు చేసింది. యేసయ్య కథనంపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసేందుకు నిర్ణయించింది.

2019-20 ఏడాది బడ్జెట్‌ను రూ.3,166.25 కోట్ల నుంచి రూ.3,243.19 కోట్లుగా సవరించింది. బర్డ్‌ ఆస్పత్రి డైరెక్టర్‌గా మదన్‌ మోహన్‌రెడ్డిని నియమించింది. సంక్రాంతిలోపు తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం దిశగా కార్యాచరణను రూపొందించింది. గొల్లమండపం మార్చేది లేదని స్పష్టం చేసింది.