సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 11 జనవరి 2020 (03:31 IST)

త్వరలోనే చైనాతో రెండో దశ వాణిజ్య చర్చలు: ట్రంప్​

చైనాతో తొలి దశ వాణిజ్య ఒప్పందంపై సంతకం పెట్టకుండానే.. రెండో దఫాపై సంకేతాలిచ్చారు ట్రంప్​. త్వరలోనే చర్చలు ప్రారంభమవుతాయని.. కానీ ఫలితాల కోసం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసే వరకు వేచి చూడాలన్నారు.

వాణిజ్య యుద్ధంతో దాదాపు రెండేళ్ల పాటు వార్తల్లో నిలిచిన అమెరికా-చైనా.. ఇప్పుడు స్నేహగీతం పాడుతునట్టు కనిపిస్తోంది. ఎన్నో చర్చలు, సమావేశాల తర్వాత ఈ నెల 15న ఇరు దేశాల మధ్య తొలి దశ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసే అవకాశముందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.

అది పూర్తి కాక ముందే రెండో దశ ఒప్పందంపై సంకేతాలిచ్చారు ట్రంప్​. ఆలస్యం కాకుండానే రెండో దశ ఒప్పందం దిశగా చర్చలు ప్రారంభమవుతాయని అగ్రరాజ్య అధ్యక్షుడు స్పష్టం చేశారు. కానీ ఈ చర్చల ఫలితాల కోసం అమెరికా అధ్యక్ష ఎన్నికల వరకు వేచి చూడాలన్నారు.