1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Direct flight between Qatar and Saudi Arabia

సోమవారం నుంచి ఖతర్, సౌదీ అరేబియా దేశాల మధ్య డైరెక్ట్ విమాన సర్వీసు

Direct flight
మూడేళ్ల వివాదానికి తెర దించుతూ ఖతర్, సౌదీ అరేబియా ఇరు దేశాల మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఈ మేరకు ఖతర్, సౌదీ ఎయిర్‌లైన్స్ ట్విటర్ ద్వారా కీలక ప్రకటన చేశాయి.

సోమవారం నుంచి దోహా, రియాద్ మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాయి. జనవరి 14న జెడ్డా నుంచి ఓ విమాన సర్వీసు, దమ్మాం నుంచి జనవరి 16న మరో విమాన సర్వీసు నడుస్తుందని స్పష్టం చేసింది. అది కూడా బోయింగ్ 777-300, బోయింగ్ 787-8, ఎయిర్‌బస్ ఏ350 వంటి పెద్ద విమానాలు నడిపిస్తామని పేర్కొంది.

"సౌదీ అరేబియాలోని మా వాణిజ్య, కార్గో భాగస్వాములతో పాటు దేశంలోని ప్రధాన విమానాశ్రయాలతో తిరిగి బలమైన సంబంధాన్ని ప్రారంభించడానికి మేము ఎదురుచూస్తున్నాము" అని ఖతర్ ఎయిర్లైన్స్ ట్వీట్ చేసింది.

సౌదీ కూడా రియాద్, జెడ్డా నుంచి దోహాకు సోమవారం నుంచి విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సౌదీ ఎయిర్‌లైన్స్ ట్వీట్ చేసింది. 
About Writer
ఎం
తర్వాతి కథనం
పెరిగిన కరోనా స్ట్రెయిన్ కేసులు : కరోనా తాజా కేసుల అప్డేట్స్