సంబంధిత వార్తలు
- ఇరాన్ పైన యుద్ధం చేయమన్నది మీరే కదా పీట్: రక్షణ మంత్రిని ఇరికించిన ట్రంప్
- గిల్లితే కాటేస్తాం, ఇరాన్ వార్నింగ్: ట్రంప్ 5 అడుగులు వెనక్కి, యుద్ధం విరమణ అంటూ...
- ఇరాన్ సంచలన నిర్ణయం.. హర్మూజ్ దాటాలంటే రూ.18 కోట్లు ఫీజు చెల్లించాల్సిందే...
- మా పవర్ ప్లాంట్‌పై ఒక్క బాంబు పడిందో.. గల్ఫ్ దేశాల్నీ అంధకారంలోకి వెళతాయి : ఇరాన్ వార్నింగ్
- బంగారం ధరలు ఢమాల్, మార్చి 2న 10 గ్రా. రూ. 1.72 లక్షలు, మార్చి 23న 1.39 లక్షలు
ఇరాన్ అగ్ర నాయకులను హతమార్చాల్సిందే : ట్రంప్‌కు నెతన్యాహు పిలుపు
ఇరాన్ అణ్వాయుధ సంపత్తితో ప్రపంచానికి ముప్పు పొంచివుందని, అందువల్ల ఇరాన్ అగ్రనాయకత్వాన్ని హతమార్చాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పిలుపునిచ్చారు. అందువల్ల ఇరాన్‌పై దాడులను మరింత ముమ్మరం చేస్తాని ఆయన ప్రకటించారు.
నిజానికి ఇరాన్‌తో ఐదు రోజుల కాల్పుల విరమణ పాటించాలంటూ డోనాల్డ్ ట్రంప్ తమ దేశ సైన్యానికి పిలుపునిచ్చారు. దీన్ని నెతన్యాహు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, తమ సైన్యంతో దాడులు చేయిస్తున్నారు. అదేసమయంలో ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తక్షణమే దాడులు చేయాలని ట్రంప్‌పై ఆయన ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.
కాగా, ఇరాన్ తన అణు క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేస్తోందని, ఆ దేశ రాజకీయ, సైనిక నాయకులు రహస్య బంకర్లలో సమావేశమవుతున్నారని తమ వద్ద పక్కా నిఘా సమాచారం ఉందని నెతన్యాహు అమెరికాకు వివరించారు. వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తేనే ప్రస్తుత యుద్ధానికి ముగింపు పలకవచ్చని ఆయన బలంగా వాదిస్తున్నారు. ట్రంప్ ఇచ్చిన ఐదు రోజుల గడువును ఇరాన్ తన రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవడానికి ఉపయోగించుకుంటుందని, ఇది మిత్రదేశాల భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
నెతన్యాహు తాజా ఒత్తిడితో అంతర్జాతీయంగా ఆందోళనలు మొదలయ్యాయి. ఒకవేళ అమెరికా దాడులకు దిగితే అది పూర్తిస్థాయి యుద్ధానికి దారితీయవచ్చని, ప్రపంచ మార్కెట్లలో చమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో నెతన్యాహు విజ్ఞప్తిని వైట్‌హౌస్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం.
