సంబంధిత వార్తలు
- వెనెజులా ముగిసింది, గ్రీన్ ల్యాండ్ పైన ట్రంప్ కన్ను, ఏం జరుగుతుంది?
- నేను నిర్దోషిని - వెనెజువెలా దేశ అధ్యక్షుడుని.... కోర్టులో నికోలస్ మదురో
- నన్ను సంతోషపెట్టడం భారతదేశానికి చాలా ముఖ్యం, లేదంటే?: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- అంధకారంలో వెనెజువెలా రాజధాని - మొబైల్ చార్జింగ్ కోసం బారులు
- వెనెజువెలా అధ్యక్షుడి నిర్భంధం.. ఇక మీ వంతేనంటూ ప్రత్యర్థులకు ట్రంప్ హెచ్చరిక
ట్రంప్‌ను వెక్కిరిస్తూ డాన్స్ చేసిన మదురో, అందుకే వెనెజులాపై దాడి చేసారా?
వెనెజులాపై దాడికి ఓ కారణం వుందంటూ ప్రచారం జరుగుతోంది. తొలుత మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న పడవలపై అమెరికా సైన్యం దాడి చేసి నాశనం చేసింది. అది కూడా సముద్రంలో. ఈ ఘటనలు జరుగుతున్న నేపధ్యంలో ఆ దేశ అధ్యక్షుడు మదురో తన సోషల్ మీడియా పేజీలో ట్రంప్ చర్యలను ఎగతాళి చేస్తున్నట్లుగా డాన్స్ చేస్తూ వీడియో వదిలాడట. అందులో... ట్రంప్ దెబ్బకి ఉలిక్కిపడినట్లు, భయపడుతున్నట్లు నటిస్తూ ట్రంప్‌ను వెక్కిరిస్తూ డాన్స్ చేసాడట. ఆ వీడియో చూసిన ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి గురై వెనెజులాపై దాడి చేసే నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తమ్మీద ట్రంప్ ఇగో హర్ట్ అవడంతోనే వెనెజులాపై దాడి చేసినట్లు చెప్పుకుంటున్నారు.
వెనెజులా ముగిసింది, గ్రీన్ ల్యాండ్ పైన ట్రంప్ కన్ను, ఏం జరుగుతుంది?
వెనెజులా అధ్యక్షుడిని అదుపులోకి తీసుకున్న అమెరికా ఇప్పుడు తన దృష్టిని మరో ప్రాంతంపై సారిస్తోంది. దీనికి నిదర్శనం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు. ఆయన మాట్లాడుతూ... మరో 20 రోజుల్లో గ్రీన్ ల్యాండ్ గురించి మాట్లాడుకుందామంటూ చెప్పడంతో ఇది కాస్తా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ వ్యాఖ్యలపై డెన్మార్క్ ప్రధాని ఫ్రెడెరిక్సన్ మరింత ఘాటుగా స్పందించారు.
నాటో లోని సభ్యదేశంపై అలాంటి చర్యకు దిగితే నాటోకి బీటలు వారతాయంటూ హెచ్చరించారు. సోవియట్ యూనియన్ విస్తరణను అడ్డుకట్ట వేసేందుకు 12 దేశాలు 1949లో నాటోను ఏర్పాటు చేసి అందులో సభ్యులయ్యాయి. ఆ తర్వాత వాటి సంఖ్య 30కి చేరింది. ఐతే ఇపుడు అమెరికా నాటోలో సభ్యదేశంగా వున్న డెన్మార్క్ దేశానికి చెందిన గ్రీన్ లాండ్ గురించి మాట్లాడటం చర్చకు దారి తీసింది.
ఒకవైపు డెన్మార్క్ ప్రధాని హెచ్చరించినా అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్ సలహాదారు అగ్నికి ఆజ్యం పోసేలా మాట్లాడారు. అసలు గ్రీన్ లాండ్ అనేది డెన్మార్క్ దేశానికి చెందినదని ఆధారాలు ఏమైనా వున్నాయా అంటూ ప్రశ్నించారు. దీనికితోడు ఆయన భార్య ఏకంగా గ్రీన్ లాండ్ మ్యాప్ పైన అమెరికా జాతీయ జెండాను పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీనితో పరిస్థితి ఎలా మారుతుందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
