శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : గురువారం, 31 జనవరి 2019 (12:52 IST)

శవాన్ని కూడా వదిలిపెట్టని కామాంధుడు.. శ్మశానవాటికలో శవంతో కూడా..?

మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి, అయితే అమెరికాలో జరిగిన ఓ సంఘటన అందరినీ కలవరపడేలా చేసింది. ఈ దారుణ సంఘటన ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించింది. 2015లో స్మిత్ అనే యువకుడు మస్కోజీ కౌంటీలోని హామిల్డన్ రోడ్డులో గల ఓ స్మశాన వాటికలోకి రహస్యంగా ప్రవేశించి, పాతిపెట్టేందుకు సిద్ధంగా ఉన్న ఓ యువతి శవాన్ని అత్యంత దారుణంగా అనుభవించాడు. మృతదేహంపై అతడు చేస్తున్న అత్యాచారం సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అత్యాచారం తర్వాత అక్కడి నుండి మెల్లగా జారుకున్నాడు. 
 
వీడియో చూసి షాక్‌కి గురైన పోలీసులు, మృతదేహానికి పరీక్షలు నిర్వహించగా అతని డీఎన్ఎ లభించింది. స్మిత్‌ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతని మానసిక స్థితి సరిగా లేదని నాలుగేళ్లుగా కొంత మంది వాదించగా, అతను కావాలనే యువతి శవంపై అత్యాచారానికి పాల్పడినట్లు మరికొందరు లాయర్లు వాదించారు. 
 
చివరకు అతను తన మానసిక స్థితి బాగానే ఉందని తెలపడంతో న్యాయమూర్తి అతనికి శిక్ష ఖరారు చేసారు. ఎలాంటి కుటుంబం, ఇళ్లు లేని కారణంగా వేరే దారిలేక శవంపై కోరిక తీర్చుకున్నానని అంగీకరించడం వల్ల అతనికి కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.