శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 31 జనవరి 2019 (11:54 IST)

ప్రియురాలితో డేటింగ్.. ఆపై గొంతుకోసి హత్య : ముంబైలో దారుణం

ముంబైలో దారుణం జరిగింది. 20 యేళ్ళ ప్రియురాలితో కొద్దికాలంపాటు డేటింగ్ చేసిన ప్రియుడు.. ఆమెతో విభేదాలు రావడంతో గొంతుకోసి హత్య చేశాడు. ఈ దారుణం ముంబైలోని వాకేశ్వర్ ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
వాకేశ్వర్ ప్రాంతానికి చెందిన కునాల్ బవదాని అనే యువకుడు స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలో పని చేస్తున్నాడు. అదే ఏజెన్సీలో 20 యేళ్ల యువతి పని చేస్తోంది. ఆమెపై మనసుపడిన కునాల్ ప్రేమ ప్రతిపాదన తీసుకొచ్చాడు. దీనికి ఆమె సమ్మతించడంతో వారిద్దరూ డేటింగ్ చేస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో ప్రియురాలితో విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో ఆ ప్రియురాలు కునాల్‌కు దూరంగా ఉంటూ వచ్చింది. ఈ క్రమంలో మాట్లాడాలని చెప్పి కునాల్ తన మాజీ ప్రేయసిని బోరివలిలోని పార్కుకు పిలిపించి ఆమెను కత్తితో గొంతు కోశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. రక్తం ఓడుతూ ప్రేయసీ ప్రియులు పడి ఉండగా పోలీసులు వారిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.