గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 30 జనవరి 2019 (17:23 IST)

ప్రాణాలతో ఉన్న వృద్ధురాలిని పీక్కుతిన్న వీధి కుక్కలు.. ఎక్కడ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఒళ్లు జలదరించే ఘటన ఒకటి జరిగింది. ప్రాణాలతో ఉన్న ఓ వృద్ధురాలిని వీధి కుక్కలు సజీవంగా పీక్కుతిన్నాయి. ఈ విషాదకర ఘటన శ్రీకాకుళం జిల్లాలోని శ్రీహరిపురం గ్రామంలో జరిగింది. 
 
బుధవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన అంపిల్లి రాముడమ్మ అనే 65 యేళ్ళ వృద్ధురాలు మంగళవారం రాత్రి తన ఇంటి గడపలోనే నిద్రించింది. రాత్రి సమయంలో అటుగా వచ్చిన వీధి కుక్కల గుంపు... నిద్రపోతున్న రాముడమ్మపై ఒక్కసారిగా దాడిచేశాయి. నిద్రమత్తులో ఉన్న ఆమె.. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు.. కుక్కలన్నీ కలిసి ఆమెను వీధిలోకి ఈడ్చుకొచ్చాయి. 
 
ఆ తర్వాత కుక్కలన్నీ కలిసి ఆమె శరీరాన్ని పీక్కుతిన్నాయి. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. వీధి కుక్కల స్వైరవిహారంతో గ్రామ ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.