శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 15 డిశెంబరు 2018 (14:32 IST)

అతనికి రోడ్డే నివాసం.. రోడ్డు కుక్కలకు అన్నం పెడితే.. అవేం చేశాయో తెలుసా?

శునకాలకు విశ్వాసం ఎక్కువ. అందుకే వాటికి ఆహారం ఇచ్చి ప్రతి ఇంటా పెంచుకుంటూ వుంటాం. విశ్వాసానికి మారుపేరైన శునకాలు తమకు అన్నం పెట్టిన యజమానుల కోసం ఏమైనా చేస్తాయనే సంగతి తెలిసిందే. అలాంటి విశ్వాసాన్ని బ్రెజిల్ స్ట్రీట్ డాగ్స్ ప్రదర్శించాయి. వివరాల్లోకి వెళితే.. ప్రతిరోజూ అన్నం పెట్టే సీసర్ అనే వ్యక్తి ఇల్లు లేని కారణంగా రోడ్డుపైనే జీవనం సాగిస్తున్నాడు. 
 
అయితే అతడు తనకు ఆహారం లేకపోయినా.. ఆ వీధుల్లో వున్న శునకాలకు తనకు సంపాదించుకున్న ఆహారాన్ని పెట్టేవాడు. అయితే ఇటీవల సీజర్ ఆస్పత్రిలో చేరాడు. బలహీనత కారణంగా చికిత్స పొందిన సీజర్‌ను చూసేందుకు ఆ వీధి కుక్కలు ఆస్పత్రి ముందు వచ్చి నిలబడ్డాయి. అరగంట వరకు ఆ డాగ్స్.. ఆస్పత్రి గేటు ముందు నిల్చున్నాయని.. తమ యజమాని బయటికి వచ్చేంత వరకు అవి అలానే నిల్చుండిపోయాయని ఆస్పత్రి సిబ్బంది నర్స్ క్రిస్ మప్రిమ్ తెలిపారు. 
 
ఆపై సీజర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక.. శునకాలతో కలిసి ఆయన భోజనం చేశాడని మప్రిమ్ వెల్లడించారు. ఈ మేరకు సీజర్ కోసం వేచి చూస్తూ నిలబడిన శునకాల ఫోటోను నర్స్ క్రిస్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.