సంబంధిత వార్తలు
- పాకిస్థాన్ వంకర బుద్ధి పోలేదు.. ఆపరేషన్ సిందూర్ 2.0 తప్పేలా లేదు : దుశ్యంత్ సింగ్
- జనాభా పెంచేందుకు చైనా వింత చర్య : కండోమ్స్‌లపై 13 శాతం వ్యాట్
- Vizag: కైలాసగిరి కొండలపై కాంటిలివర్ గాజు వంతెన ప్రారంభం
- భారత్- చైనా చేతులు కలిపితే అంతే సంగతులు.. అమెరికా కొత్త తలనొప్పి.. ఏంటది?
- China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్
భారత్ -పాకిస్థాన్ కాల్పుల విరమణ వెనుక ఎవరి జోక్యం లేదు : భారత్
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణకు తాము మధ్యవర్తిత్వం వహించామంటూ చైనా చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ ఖండించింది. కాల్పుల విరమణలో మూడో దేశం మధ్యవర్తిత్వం లేదని స్పష్టం చేసింది. రెండు దేశాల సైనిక డీజీఎంపోలు చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయమని, ఇందులో మూడో పక్షం పాత్ర రవ్వంత కూడా లేదని స్పష్టం చేసింది.
ఈ యేడాది భారత్ - పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల సడలింపునకు తామే మధ్యవర్తిత్వం నడిపామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మంగళవారం ప్రకటించారు. ఉత్తర మయన్మార్ సంక్షోభం, ఇరాన్ అణు సమస్య, ఇజ్రాయెల్-పాలస్తీనా ఉద్రిక్తతల పరిష్కారానికీ తాము మధ్యవర్తిత్వం వహించామని చెప్పారు.
మరోవైపు పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాక్‌ల మధ్య జరిగిన కాల్పుల విరమణ అంగీకారం కుదిర్చారంటూ భారతీయ మూలాలున్న ట్రంప్ సహాయకుడు రికీ గిల్‌ను అమెరికా ప్రభుత్వం తాజాగా సత్కరించి, అవార్డు ప్రదానం చేయడం గమనార్హం.
