60 లక్షల మంది చూసిన రోడ్డు ప్రమాదం వీడియో
ప్రమాదం అంటేనే రెప్పపాటులో జరిగిపోతుంది. ఇక రోడ్డు ప్రమాదాల గురించి చెప్పనక్కర్లేదు. ఐతే ఒక రోడ్డు ప్రమాదం సంభవించిన తీరును ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఆ రోడ్డు ప్రమాదం తాలూకు వీడియోను ఇప్పటివరకూ 60 లక్షల మంది చూసారు. ఆ రోడ్డు ప్రమాదం తీరుపై వ్యాఖ్యలు కూడా చేసారు.
ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియోలో... ఓ చిన్నారి రద్దీగా వున్న రోడ్డుకి అడ్డంగా వచ్చేసింది. అదే సమయంలో ఓ పెద్ద లారీ వేగంగా వస్తోంది. ఆ చిన్నారి అదే స్పీడుతో వెళ్తే ఖచ్చితంగా ఆ వాహనం కింద పడిపోయేదే. కానీ ఇంతలో మరింత వేగంగా వచ్చిన ఓ బైకర్ ఆ చిన్నారికి పక్కగా తాకుతూ వెళ్లాడు. ఆ చిన్నారి రోడ్డుపై పడిపోయింది. వేగంగా వచ్చే వాహనం కింద పడకుండా పక్కకి పడిపోవడంతో ప్రాణాలతో బైటపడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూడండి ఆ వీడియో...
Biker accidentally saved a kids life pic.twitter.com/39EjYitiEy
— Rai ji (@Vinod_r108) April 13, 2026

