1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
  4. Watch: Sanju Samson explodes, brutally throws his bat in anger after getting out vs PBKS

సంజూ శాంసన్‌కు కోపమొచ్చింది.. గాలిలోకి బ్యాట్ ఎగిరింది.. గిరగిరా తిరిగింది.. వీడియో వైరల్

Sanju Samson
Sanju Samson
ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, పంజాబ్‌ మ్యాచ్‌లో సంజూ శాంసన్ అసహనం వ్యక్తం చేసిన ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ ఓపెనర్లు నిలకడగా 11 ఓవర్లకు స్కోర్‌ 92 ఆడుతున్న సమయంలో ఫెర్గూసన్ బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి సంజుశాంసన్‌ (38) పరుగుల వద్ద వెనుదిరిగాడు. 
 
కాగా ఔటైన కోపంలో శాంసన్ తన బ్యాటును గాలిలోకి విసిరాడు. సంజూ శాంసన్ ఆడిన తొలి బంతికి ఫోర్ కొట్టాడు. రెండో బంతికే అవుట్ అయ్యాడు. దీంతో 26 బంతుల్లో ఆరు ఫోర్లతో 38 పరుగులు సాధించి పెవిలియన్ చేరుకున్నాడు.

శాంసన్ ఔటైనా జైశ్వాల్‌తో కలిసి తొలి వికెట్‌కు 10.2 ఓవర్లలోనే 89 పరుగులు జోడించాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన శాంసన్.. కెప్టెన్‌గా తన బాధ్యతలను చేపట్టాడు. ఇప్పటివరకు రాజస్థాన్ ఆడిన మూడు మ్యాచ్‌లో ఒకటి మాత్రమే గెలుచుకుంది. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
గాయం నుంచి కోలుకున్న బుమ్రా - ముంబై ఇండియన్స్‌లో కొత్త జోష్ (Video)