గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 నవంబరు 2024 (16:38 IST)

సంజూ శాంసన్ ఖాతాలో అవాంఛిత రికార్డు

Sanju Samson
విదేశీ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు చెందిన క్రికెటర్ సంజూ శాంసన్ ఖాతాలో ఓ అవాంఛిత రికార్డు ఒకటి నమోదైంది. టీ20 ఫార్మాట్లో ఒక క్యాలెండర్ యేడాదిలో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత ప్లేయర్‌గా సంజూ శాంసన్ నిలిచాడు.
 
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికా పర్యటనలో ఉంది. ఈ టోర్నీలో సంజూ శాంసన్ తొలి టీ20లో సెంచరీ సాధించి టీ20 ఫార్మాట్లో వరుసగా రెండు సెంచరీలు సాధించిన ఏకైక భారతీయ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. సఫారీలతో టీ20 సిరీసు ముందు హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌పై శతకం బాదడంతో ఈ రికార్డు అతడి సొంతమైంది. 
 
అయితే, ఆదివారం రాత్రి దక్షిణాఫ్రికాపై రెండో టీ20లో కూడా సెంచరీ సాధించి సరికొత్త చరిత్ర లిఖిస్తాడేమో అని ఆశిస్తే తీవ్రంగా నిరాశపరిచాడు. మూడు బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. యన్సెన్ బౌలింగ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో సంజూ శాంసన్ ఖాతాలో ఒక అవాంఛిత రికార్డు చేరింది. దక్షిణాఫ్రికాపై రెండో టీ20లో డకౌట్‌తో కలుపుకొని ఈ ఏడాది మొత్తం 4 సార్లు సున్నా పరుగులకే ఔట్ అయ్యాడు.
 
ఈ విషయంలో టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను కూడా సంజూ మించిపోయాడు. వీరిద్దరి కంటే ఎక్కువసార్లు డకౌట్లు అయ్యాడు. కాగా గెబెర్హా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో మొదటి ఓవర్లో సంజూ శాంసన్ ఔట్ అయ్యాడు. మార్కో యన్సెన్ వేసిన ఈ ఓవర్ మూడవ బంతికి స్టంప్స్ వదిలేసి ఆడాడు. లెంగ్త్ బాల్ దూసుకెళ్లి వికెట్లకు తగిలడంత పెవియన్‌కు చేరాడు.