శుక్రవారం, 3 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 నవంబరు 2024 (12:59 IST)

సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు.. ధోనీ రికార్డ్ బ్రేక్

Sanju Samson
Sanju Samson
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికాతో నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో శతకం సాధించడం ద్వారా సంజూ శాంసన్ అద్భుత ఫీట్ సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో వరుస ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాదిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డ్ సాధించాడు. 
 
ఈ శతక ఇన్నింగ్స్‌తో సంజూ శాంసన్ తన పేరిట పలు రికార్డులను లిఖించుకున్నాడు. ప్రొఫెషనల్ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 7000 పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాటర్‌గా నిలిచాడు. ఈ ఫీట్ సాధించేందుకు సంజూ శాంసన్ 269 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ఈ క్రమంలో మహేంద్ర సింగ్ ధోనీని అధిగమించాడు.
 
మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సంజూ శాంసన్.. భారీ సిక్స్‌లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ(7) విఫలమైనా.. సూర్యకుమార్ యాదవ్(21), తిలక్ వర్మ(33)లతో కలిసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 
 
27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సంజూ శాంసన్.. మరో 20 బంతుల్లోనే సెంచరీని అందుకోవడం విశేషం. సంజూ సూపర్ బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 202 పరుగుల భారీ స్కోర్ చేసింది.