మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 నవంబరు 2024 (15:58 IST)

పాన్ ఇండియా చిత్రాలకు ఆ తమిళ హీరోనే స్ఫూర్తి : ఎస్ఎస్.రాజమౌళి

Rajamouli
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి పాన్ ఇండియా మూవీలకు పెట్టింది పేరు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ అన్ని భాషల్లో ఘన విజయం సాధించాయి. అయితే, తాను పాన్ ఇండియా మూవీలు తీయడానికి ప్రధాన కారణం తమిళ హీరో సూర్య స్ఫూర్తి అని చెప్పారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, సూర్య హీరోగా దర్శకుడు సిరుత్తై శిన రూపొందించిన "కంగువా" సినిమా ఈ నెల 14న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. 
 
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజమౌళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హీరో సూర్యపై ప్రశంసల వర్షం కురిపించారు. తెలుగు సినిమాని తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయకుండా ప్రపంచానికి చూపించే విషయంలో సూర్యనే తనకు స్ఫూర్తి అని రాజమౌళి చెప్పారు. 
 
"గజిని" మూవీ విడుదల సమయంలో ఆయన చేసిన ప్రచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లు చెప్పారు. సూర్య తెలుగు ప్రేక్షకులకు ఎలా దగ్గర కాగలిగాడు అనే దాన్ని కేస్ స్టడీగా తీసుకోమని మన హీరోలు, నిర్మాతలకు చెప్పేవాడినని అన్నారు. అలా తన పాన్ ఇండియా మూవీ "బాహుబలి"కి సూర్యనే స్ఫూర్తి అని తెలిపారు.