సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 6 ఏప్రియల్ 2024 (23:27 IST)

విరాట్ కోహ్లి సెంచరీ వృధా: RCB పైన RR 6 వికెట్ల తేడాతో ఘన విజయం- video

Buttler
RCB మళ్లీ బోల్తా కొట్టింది. విరాట్ కోహ్లి సెంచరీ చేసినా ఫలితం దక్కలేదు. అందులో కూడా విరాట్ చేసిన సెంచరీ చాలా స్లో సెంచరీగా రికార్డు కూడా సృష్టించింది. అందుకే కోహ్లిని వేస్ట్ కోహ్లి అంటూ ట్విట్టర్లో ట్యాగ్ చేసి గోలగోల చేస్తున్నారు. RCB నుంచి ఓపెనర్ గా దిగిన కోహ్లి 72 బంతుల్లో 113 పరుగులు చేసాడు. ప్లెస్సీ 44, మాక్సవెల్ డకౌట్, చౌహాన్ 9, కామరూన్ 5 పరుగులతో కలిపి RCB 183 పరుగులు చేసింది. 184 పరుగుల విజయ లక్ష్యంతో దిగిన రాయల్స్ జట్టు ఆదిలోనే షాక్ ఇచ్చారు RCB బౌలర్లు. ఐతే దాన్నుంచి తేరుకుని ధాటిగా ఆడింది.
 
జైస్వాల్ డకౌట్ అయినప్పటికీ జోస్ బట్లర్ అజేయ సెంచరీతో చెలరేగిపోయాడు. 58 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ సాధించి నాటవుట్ గా నిలిచాడు. సంజూ శాంసన్ 69, రియాన్ 4, ధ్రువ్ 2, షిమ్రోన్ 11 పరుగులతో మరో 5 బంతులు మిగిలి వుండగానే 189 పరుగులతో లక్ష్యాన్ని ఛేదించారు. దీనితో RR వరుసగా 4 మ్యాచులు గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. పాయింట్ల పట్టికలో RCB అధఃపాతాళానికి జారిపోయింది.