సంబంధిత వార్తలు
- రైల్వేలో 432 అప్రెంటిస్ పోస్టులు - రక్షణ శాఖలో కూడా...
- గోల్డ్ లోన్ ఇచ్చేందుకు పోటీపడుతున్న బ్యాంకులు.. చౌక వడ్డీకే ఎస్బీఐ?
- ఆన్‌లైన్ స్టడీస్.. జూమ్ యాప్‌తో కుస్తీలు పడుతున్న ఉపాధ్యాయులు
- 15 పోస్టుల భర్తీ.. ఐఈఎస్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ
- అమేజాన్ కొత్త సేల్.. ఆగస్టు 11వరకు ఫ్రీడమ్ సేల్.. భారీ ఆఫర్లు
ఇక ఫార్మసీ సేవల్లోనూ అమేజాన్.. సరికొత్త నిర్ణయం
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమేజాన్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఔషధాలను కూడా ఆన్ లైన్‌లో విక్రయించాలని భావిస్తోంది. ఈ ఫార్మసీ సేవలను తొలుత బెంగళూరులో అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అమేజాన్ ఫార్మసీ పేరిట అందించే ఈ సేవలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. నోటి మాటతో అడిగి తీసుకునే మందులనే కాకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌పై మాత్రమే లభించే ఔషధాలను కూడా అమేజాన్ తన ఆన్‌లైన్ దుకాణంలో విక్రయించనుంది.
అంతేకాదు, సాధారణ స్థాయి వైద్య పరికరాలు, సంప్రదాయ భారత మూలికా ఔషధాలు కూడా అమేజాన్ ఫార్మసీలో లభించనున్నాయి. భారత్‌లో వాల్ మార్ట్ ఆధ్వర్యంలోని ఫ్లిప్ కార్ట్, ముఖేశ్ అంబానీకి చెందిన జియోమార్ట్, మరికొన్ని ఇతర ఈ-కామర్స్ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీ నేపథ్యంలో అమేజాన్ తన సేవలను మరింత విస్తరించాలని నిర్ణయించింది.
