శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 ఆగస్టు 2020 (13:26 IST)

15 పోస్టుల భర్తీ.. ఐఈఎస్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ 2020 (ఐఈఎస్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈసారి 12 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసేందుకు 2020 సెప్టెంబర్ 1 చివరి తేదీ అని ప్రకటించింది. వాస్తవానికి గతంలోనే ఈ నోటిఫికేషన్ విడుదల చేయాల్సింది. 
 
కానీ ఖాళీలు లేకపోవడం వల్ల యూపీఎస్‌సీ ఈ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. అయితే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనమిక్ ఎఫైర్స్ విజ్ఞప్తి మేరకు ఇప్పుడు ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ 2020 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది యూపీఎస్‌సీ. కేవలం 15 పోస్టుల్ని మాత్రమే ప్రకటించింది. 
 
వీరిని కేంద్ర ప్రభుత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్స్‌లో నియమిస్తుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను యూపీఎస్పీ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.
 
మొత్తం ఖాళీలు- 15
దరఖాస్తు ప్రారంభం- 2020 ఆగస్ట్ 11దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 1
ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ పరీక్ష షెడ్యూల్- 2020 అక్టోబర్ 16 నుంచి 18
విద్యార్హత- ఎకనమిక్స్ లేదా అప్లైడ్ ఎకనమిక్స్ లేదా ఎకనమెట్రిక్స్ లేదా బిజినెస్ ఎకనమిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ.
వయస్సు- 21 నుంచి 30 ఏళ్ల లోపు 
దరఖాస్తుల విత్‌డ్రా- 2020 సెప్టెంబర్ 8 నుంచి 14
అడ్మిట్ కార్డుల విడుదల- పరీక్షకు 15 రోజుల ముందు తీసుకోవచ్చు.