గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 ఆగస్టు 2020 (20:40 IST)

సివిల్స్ ఫలితాలు.. చెన్నై సిస్టర్స్‌కు ర్యాంకులు.. తండ్రిబాటలో..?

Chennai sisters
సివిల్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు యువకులు సివిల్స్‌లో అదరగొట్టారు. అలాగే సివిల్స్ ఫలితాల్లో ఒకే ఇంటి నుంచి అక్కాచెల్లెల్లు ఎంపికయ్యారు. తండ్రిబాటలో నడిచి.. సివిల్స్‌లో ఉత్తీర్ణులయ్యారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన ఐఏఎస్ అధికారి అయిన రమేశ్ చంద్ర మీనా.. తన కుటుంబంతో చెన్నైలో నివసిస్తున్నారు.
 
ఈయనకు ఇద్దరు కుమార్తెలు. మంగళవారం ప్రకటిచించిన సివిల్స్ ఫలితాల్లో అక్క అనామిక 116వ ర్యాంకు సాధించగా.. చెల్లె అంజలికి 494 ర్యాంకు వచ్చింది. తండ్రి బాటలో నడిచి సమాజసేవకు అంకితమయ్యేందుకు సివిల్స్‌ను ఎంచుకున్నామని, మహిళలు, చిన్నారుల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేయాలని పెట్టుకున్నామని చెప్పారు.
 
ఇలాఉండగా, రాజస్థాన్‌లోని శికరాయి సబ్ డివిజన్‍కు చెందిన అరవింద్ కుమార్ మీనా కూడా సివిల్స్ సాధించారు. అరవింద్ 676 ర్యాంకు వచ్చింది. చిన్ననాటనే తండ్రి చనిపోవడంతో తల్లి సజ్జన్ దేవీ రెక్కల కష్టంపై ఉన్నత చదువులు చదివాడు. మట్టిగుడిసెలో నివసించిన ఈ మాణిక్యం సివిల్స్ సాధించడంపై శికరాయి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.