గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 3 ఆగస్టు 2020 (16:29 IST)

నా ఆడపడుచులందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు: మెగాస్టార్ చిరంజీవి

సోదరుడికి రక్ష రాఖీ. ఈరోజు ఈ పండుగ సందర్భంగా దేశ వ్యాప్తంగా సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి వారిని ఆశీర్వదిస్తున్నారు. అలాగే వారి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. ఇక ఈ రాఖీ పండుగ సంబరాలు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోనూ జరిగాయి.
 
ఈ సందర్భంగా చిరంజీవి.. "నా చెల్లెళ్ళిద్దరితోనే కాదు. తెలుగింటి ఆడపడచులతో అన్నయ్య అని పిలిపించుకునే అదృష్టం నాది. నా ఆడపడుచులందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు." అని పేర్కొన్నారు.