ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 జులై 2020 (17:47 IST)

తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుందనీ... సోదరినీ మట్టుబెట్టిన అన్నలు.. ఎక్కడ?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పరువు హత్య జరిగింది. తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తోడబుట్టిన చెల్లిని ముగ్గురు అన్నలు కలిసి హత్య చేశారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మెయిన్‌పురి జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని అంగోత గ్రామానికి చెందిన జ్యోతి మిశ్రా.. మ‌రో గ్రామ యువ‌కుడైన రోహిత్ యాద‌వ్‌ను రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి కులాలు వేరు. ముఖ్యంగా వధువు ఉన్నత కులస్థురాలు కాగా, వరుడు తక్కువ కులస్థుడు. దీంతో వీరి ప్రేమ వివాహానికి వధువు తరపు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. 
 
ఈ వివాహం వల్ల తమ పరువు పోయిందని భావించిన వధువు అన్నలు.. ఆమెపై పగ తీర్చుకోవాలని ప్లాన్ వేశారు. తక్కువ కులం యవకుడితో తమ చెల్లి కలిసి కాపురం చేయడం అస్సలు ఇష్టంలేని జ్యోతి సోదరుల‌ు... అదును చూసి దెబ్బ కొట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. 
 
దీంతో ఇటీవ‌లే జ్యోతిపై ఆమె సోద‌రులు కాల్పులు జ‌ర‌ప‌డంతో ప్రాణాలు కోల్పోయింది. రోహిత్ మాత్రం తీవ్ర గాయాల‌తో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.