సంబంధిత వార్తలు
- భారత పర్యటనకు ఆస్ట్రేలియా ఓకే... భార్యలు - ప్రియురాళ్లకు అనుమతి నో!!
- భారతదేశంలో మొదటిసారిగా ఒకేసారి కాలేయం- మూత్రపిండాల మార్పిడి చేసిన గ్లెనీగల్స్ గ్లోబల్ హెల్త్ సిటీ
- 8 భారతీయ భాషల్లో జియోపేజెస్ పేరిట సరికొత్త బ్రౌజర్
- దేశంలో కరోనా కొత్త కేసులు 55 వేలు.. మృతులు 702
- భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా.. 55,839 కేసులు నమోదు.. 702 మంది మృతి
జియో సరికొత్త మొబైల్ బ్రౌజర్.. హిందీతో పాటు తెలుగు, మలయాళంలోనూ..?
ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియో సరికొత్త మొబైల్ బ్రౌజర్‌ను లాంచ్ చేసింది. దానికి 'జియోపేజెస్' అని పేరు పెట్టింది. గతంలో విడుదల చేసిన బ్రౌజర్‌కు ఇది అప్ డేటెడ్ వర్షన్. ఈ బ్రౌజర్ ద్వారా ఎనిమిది భారతీయ భాషల్లో ఇంటర్నెట్ సర్ఫింగ్ చేయవచ్చు.
ఈ బ్రౌజర్‌లో వినియోగదారుల వ్యక్తిగత సమాచార గోప్యతకూ పెద్ద పీట వేశామని జియో సంస్థ తెలిపింది. ఈ బ్రౌజర్ లో ఏదైనా సమాచారం కోసం సర్ఫ్ చేసినపుప్పుడు స్థానిక సమాచారం ముందు చూపిస్తుంది. ఆ విధంగా ఈ బ్రౌజర్ అల్గారిథన్ని సెట్ చేసినట్టు జియో ఓ ప్రకటనలో తెలిపింది.
గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ బ్రౌజర్‌లో పేజీలు వేగంగా లోడ్ అవుతాయని, వీడియోల స్ట్రీమింగ్ వేగంగా ఉంటుందని జియో వెల్లడించింది.
ఈ బ్రౌజర్ ఇంగ్లీషు, హిందీతో పాటు తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఇక తన పాత బ్రౌజర్‌ను వాడుతున్న దాదాపు 1.40 కోట్ల మందినీ కొత్త బ్రౌజర్‌కు అప్‌డేట్ చేస్తామని జియో తెలిపింది.
