1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. What to do if the smartphone is overheat

స్మార్ట్ ఫోన్‌ వేడైతే ఏం చేయాలి?

Smartphone care tips
స్మార్ట్‌ఫోన్‌ అత్యవసర ఉపకరణాల్లో భాగం అయ్యింది. అయితే స్మార్ట్ ఫోన్లను అతిగా వాడితే ప్రమాదమే. చాలాసార్లు స్మార్ట్‌ఫోన్‌లు వేడెక్కుతాయి. దీని కారణంగా కొంత నష్టం జరుగుతుంది. స్మార్ట్‌ఫోన్‌లు వేడెక్కకుండా ఎలా కాపాడుకోవాలో చూద్దాం..
 
సూర్యకాంతి తగిలే ప్రదేశాల్లో స్మార్ట్ ఫోన్‌ను ఎక్కువసేపు ఉంచకపోవడమే మంచిది.
 
ఎక్కువ సేపు వాడిన తర్వాత కూడా స్మార్ట్‌ఫోన్ వేడెక్కుతుంది. కాబట్టి మీరు ఫోన్‌కు కాస్త విశ్రాంతి ఇవ్వవచ్చు.
 
ఒకే సమయంలో చాలా అప్లికేషన్‌లను ఉపయోగించడం మానుకోండి. మీకు అవసరమైన అప్లికేషన్‌లను మాత్రమే ఉపయోగించండి.
 
స్మార్ట్‌ఫోన్ చాలా వేడిగా ఉంటే, కవర్‌ నుంచి బయటితి తీసి నీడ ఉన్న ప్రదేశంలో కాసేపు ఉంచండి.
 
బ్యాటరీ వినియోగం పెరిగినా స్మార్ట్‌ఫోన్ వేడెక్కుతుంది. కాబట్టి ఉపయోగించని సమయాల్లో బ్యాటరీ సేవర్ మోడ్‌ను ఆన్ చేయడం మంచిది.
 
నాసిరకం లోకల్ బ్యాటరీలను ఉపయోగించడం వల్ల స్మార్ట్‌ఫోన్‌లు వేడెక్కుతాయి. కాబట్టి నాణ్యమైన బ్యాటరీలను వాడండి. 
 
స్మార్ట్‌ఫోన్‌లో మాల్‌వేర్ వంటి వైరస్‌లు ఉంటే, అది వేడిగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అనవసరమైన యాప్‌లను ఇన్‌స్టాల్ చేయకపోవడమే మంచిది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
రాజ్యసభకు ఇద్దరు మణిపూర్ మహిళలను నామినేట్ చేయండి : రాష్ట్రపతిని కోరిన ఇండియా