శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 ఆగస్టు 2023 (14:59 IST)

కాషాయం కండువా కప్పుకోనున్న సినీ నటి జయసుధ

jayasudha
సీనియర్ సినీ నటి జయసుధ బీజేపీలో చేరనున్నారు. ఇందుకోసం ఆమె బుధవారం ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం ఆమె కాషాయం కండువా కప్పుకోనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో జరిగే ఈ కార్యక్రమానికి బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి, సీనియర్ నేతలు బండి సంజయ్, లక్ష్మణ్‌లు హాజరుకానున్నారు. గత 2009 సంవత్సరంలో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ఆమె కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆమె క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. 
 
ఇపుడు మళ్లీ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె బీజేపీ ప్రాథమిక సభ్యత్వాన్ని స్వీకరించనున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఇప్పటికే తెంలగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, బండి సంజయ్ తదితరులు ఢిల్లీలోనే ఉన్నారు. వీరంతా ఈ కార్యక్రమానికి హాజరువుతున్నారు. అయితే, బీజేపీలో చేరే జయసుధ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో జరిగే ఎన్నికల్లో ముషిరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే, ఆమెకు పార్టీ నాయకత్వం టిక్కెట్ ఇస్తుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే.