Ranveer Singh: ధురంధర్ 2 ఎందుకు వాయిదా పడిందో తెలుసా?
Updated: Wed, 18 Mar 2026 (17:55 IST)
దురంధర్ సినిమా బాలీవుడ్ తోపాటు టాలీవుడ్ లో ఎంతటి క్రేజ్ సంపాదించుకుందో తెలిసిందే. తాజాగా రేపు ఉగాది నాడు సీక్వెల్ రాబోతుందని ప్రకటించారు. అదే రోజు తెలుగులో పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలవుతుంది. ఈ సమయంలో పవన్ కు పోటీగా సినిమా కేవలం బాలీవుడ్ సినిమా మాత్రమే వుంది. ఇప్పటికే ప్రచారం కూడా జరిగింది. ఈ సినిమా మీద ఉన్న నమ్మంతో ఎప్పుడో ఇండియా వైడ్ గా ప్రీమియర్స్ వేస్తూ బుకింగ్స్ ఓపెన్ చేసేసారు. ఇందులో తెలుగు వెర్షన్ కూడా ఉన్నాయ్. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున షోస్ ప్లాన్ చేయగా అవన్నీ దాదాపు అమ్ముడుపోయాయి.
కాగా, తాజా సమాచారం మేరకు దురందర్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. అందుకు పూర్తి కంటెంట్ థియేటర్లకు రాకపోవడమే కారణమని చెబుతున్నారు. దీనితో ఈ సినిమా కోసం ఎదురు చూసిన తెలుగు ఆడియెన్స్ మాత్రం బాగా డిజప్పాయింట్ అవుతున్నారు. ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్ లో భాగంగా నిర్మాత మాట్లాడుతూ, ఏ సినిమా మాకు పోటీగా వచ్చినా అది కూడా సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు.