మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 జులై 2023 (10:05 IST)

భారత మార్కెట్‌లోకి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్-Moto G14 పేరుతో..

Smartphone
Smartphone
త్వరలో భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ రానుంది. Moto G14 స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 1వ తేదీన భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 
 
త్వరలో భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోకి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ రానుంది. Moto G14 స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 1వ తేదీన భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో పలు ఫీచర్ల వివరాలు బయటకు వచ్చాయి.
 
ఈ స్మార్ట్‌ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆక్టా కోర్ UniSoc T616 SoC చిప్‌సెట్. ఇది 4GB RAM, 128GB UFS 2.2 స్టోరేజ్ కలిగి ఉంది. ఇది నీలం, బూడిద రంగులలో లభిస్తుంది.
 
Moto G14 రేర్ LED ఫ్లాష్, 50MPతో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరా వివరాలు తెలియరాలేదు. ఇది ఆండ్రాయిడ్ 13లో పని చేస్తుంది. ఇందులో 5,000 mAh బ్యాటరీ ఉంది. 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందుబాటులో ఉంది. 
 
ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 16 గంటల పాటు వీడియోలను స్ట్రీమ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఇందులో IP52 వాటర్ మరియు డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తోంది. డ్యూయల్ సిమ్ 4జీ కనెక్టివిటీ, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.