వాట్సాప్ నుంచి ఏఐ ఆధారిత ఫీచర్లు... క్షణాల్లో ప్రత్యేక స్టిక్కర్లు
తన వినియోగదారులకు మరింత మెరుగైన అనుభూతిని అందించేందుకు వాట్సాప్ సరికొత్త మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇకపై కేవలం సందేశాలు, కాల్స్‌కే పరిమితం కాకుండా కంటెంట్ క్రియేషన్, అసిస్టెన్స్, ఫోటో ఎడిటింగ్ వంటి సేవలను వాట్సాప్ ద్వారానే ఉచితంగా పొందవచ్చు. యూజర్లు తమకు నచ్చిన చిత్రాన్ని టెక్స్ట్ రూపంలో టైప్ చేయడం ద్వారా క్షణాల్లో కొత్త ఇమేజ్‌లను, ప్రొఫైల్ పిక్చర్లను అలాగే మన మూడ్‌కు తగిన ప్రత్యేక స్టిక్కర్లను తయారు చేసుకోవచ్చు.
అంతేకాకుండా గ్రూప్ లేదా పర్సనల్ చాట్స్‌లో అట్ మెటా ఏఐ అని ట్యాగ్ చేయడం ద్వారా సందేహాలకు నిమిషాల్లో సమాధానాలు పొందవచ్చు. ఈ అప్‌డేట్‌తో ఫోటో ఎడిటింగ్ కూడా చాలా సులభతరం కానుంది.
ఏదైనా ఫొటోను అప్‌లోడ్ చేసి అందులోని అనవసర భాగాలను తొలగించాలన్నా, లేదా ఆ ఫోటోలోని వస్తువులు/ప్రదేశాల గురించి తెలుసుకోవాలన్నా ఏఐ కమాండ్స్ ద్వారా సాధ్యమవుతుంది
