1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. WhatsApp working on feature to allow group admins to delete others' texts

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. గ్రూప్ అడ్మిన్‌కు ఇది గుడ్ న్యూస్

whatsapp
వాట్సాప్‌లో త్వరలో ఒక కొత్త ఫీచర్ రానున్నట్లు తెలుస్తోంది. గ్రూపులోని సభ్యులు పెట్టిన మెసేజ్‌లను కూడా అడ్మిన్స్ డిలీట్ చేయవచ్చు. త్వరలో రానున్న ఈ ఫీచర్ వాట్సాప్‌కు మరింత ప్లస్ కానుంది. దీంతో పాటు మెసేజ్ డిలీట్ చేసే టైమ్‌ని కూడా వాట్సాప్ పెంచనున్నట్లు తెలుస్తోంది. 
 
ఆ మెసేజ్ ఉన్న ప్రదేశంలో దిస్ వాజ్ రిమూవ్డ్ బై అడ్మిన్ అని కనిపిస్తుందని వాట్సాప్ తెలిపింది. తద్వారా గ్రూపుపై అడ్మిన్స్‌కు మరింత కంట్రోల్ ఇవ్వనుంది.
 
దీంతో పాటు మెసేజ్ డిలీట్ చేసే టైమ్‌ని కూడా వాట్సాప్ పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టైమ్ గంటన్నర వరకు ఉంది. త్వరలో ఈ టైమ్‌ను 2 రోజుల 12 గంటలకు పెంచుతారని తెలుస్తోంది. దీంతో పాటు మెసేజ్ రియాక్షన్స్ కూడా వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది.
తర్వాతి కథనం
అత్తారింటికి వెళ్లే ఆడపడుచులకు సీఎం జగన్ గుడ్ న్యూస్