1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. WhatsApp’s new update now allows 8 users in audio, video calls

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఏంటందో తెలుసా?

WhatsApp
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్. ఇప్పటివరకూ వాట్సాప్‌లో కేవలం నలుగురు మాత్రమే గ్రూప్ కాల్స్ మాట్లాడుకునేవారు. ఇప్పుడు ఆ సంఖ్యను ఎనిమిదికి పెంచింది వాట్సాప్. అంటే ఒకేసారి ఎనిమిది మందితో వీడియో కాలింగ్‌లో మాట్లాడవచ్చు. 
 
సోషల్ మీడియా మేసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కరోనా లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం అందరూ వాట్సాప్ వీడియో కాల్సే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ఆసక్తిని గమనించిన వాట్సాప్.. సరికొత్త ఫీచర్‌ తీసుకొచ్చింది. కాగా త్వరలో ఈ ఫీచర్‌ను భారత్‌లోని 40 కోట్ల మందికి యూజర్లకు అందించనుంది వాట్సాప్.
 
ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు వాట్సాప్ యూజర్లకు ఎనిమిది మంది మాట్లాడేందుకు వీలుగా ఈ అప్డేట్ రిలీజ్ చేసింది. ఒకవేళ మీరు బీటా యూజర్‌ అయితే మీ వాట్సాప్ V2.20.133 వర్షన్ అప్‌డేట్ చేసి ఈ ఫీచర్‌ని ఉపయోగించుకోవచ్చు.  
About Writer
సెల్వి
తర్వాతి కథనం
జమ్మూ కాశ్మీర్‌కు కరోనా రోగులను ఎక్స్‌పోర్ట్ చేస్తున్న పాకిస్థాన్: డీజీపీ