1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. whatsapp new feature use same number in multiple phones

వాట్సాప్ కొత్త ఫీచర్.. ఒకే అకౌంట్‌‌ను అలా వాడుకోవచ్చు..

whatsapp
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్ బుక్‌కు చెందిన వాట్సాప్ కొత్త ఫీచర్లతో అదరగొడుతోంది. తాజాగా లాక్ ఇన్ చేసే అప్‌డేట్‌ను అందించనుంది. వాట్సాప్ ఫేస్ బుక్ చేతికి చేరిన తర్వాత కొత్త కొత్త ఫీచర్లు వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల వాట్సాప్ వీడియో కాల్ స్టేటస్‌ను తగ్గించింది. ఇందులో భాగంగా వాట్సాప్ స్టేటస్ సమయాన్ని 30 సెకన్ల నుంచి 15 సెకన్లకు తగ్గించింది.

తాజాగా పలు ఫోన్ల నుంచి లాక్ ఇన్ చేసే అప్ డేట్‌ను వాట్సాప్ అమలు చేయనుంది. ఈ అప్ డేట్ ద్వారా వినియోగదారులు ఒకే అకౌంట్‌ను అనేక ఫోన్ల నుంచి లాక్ ఇన్ చేయొచ్చు. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు అనే ఇతరత్రా సాధనాల నుంచి వాట్సాప్‌ను లాక్ ఇన్ చేసుకోవచ్చు. ఈ అప్ డేట్ ప్రస్తుతం పూర్తిగా అమల్లోకి రాలేదు. త్వరలోనే వాట్సాప్ కస్టమర్లకు అందుబాటులోకి వస్తుందని ఫేస్ బుక్ ఓ ప్రకటనలో వెల్లడించింది. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
కరోనా బాధితులైనా బుద్ధి మారలేదు.. నగ్నంగా తిరుగుతూ నర్సులను?