శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 11 మార్చి 2020 (11:38 IST)

ప్రాణం తీసిన వాట్సాప్ చాటింగ్

నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం డిబి తాండలో వాట్సాప్ చాటింగ్ ప్రాణం తీసింది. ధర్పల్లి గ్రామానికి చెందిన గణేష్‌తో డిబీ తండాకు చెందిన మంజులతో వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత కొన్ని రోజుల పాటు వీరి సంసారం సాఫీగా సాగింది. అయితే వాట్సప్ చాటింగ్ వీరి మద్య చిచ్చు పెట్టింది. 
 
గత కొంతకాలంగా భార్య మంజుల వేరే వ్యక్తితో వాట్సాప్‌లో చాటింగ్ చేస్తుందని భర్త మందలిస్తూ వస్తున్నాడు. ఇదే క్రమంలో ఆమెపై చేయి కూడా చేసుకున్నాడు. భర్త కొట్టడంతో మనస్థాపం చెందిన మంజుల ఇంటి నుంచి వెళ్లిపోయింది. వారం రోజుల తర్వాత తల్లి ఊరైన డిబి తండాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
 
మంజుల చనిపోవడానికి కారణం అత్తగారు వేధింపులు, భర్త తరచూ కొట్టడం కారణంగానే చనిపోయిందని మృతురాలి బంధువులు భర్త ఇంటిపై దాడికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులను శాంతింప చేసే ప్రయత్నం చేశారు.
 
అయితే మంజుల మృతికి కారణమైన వాట్సాప్ మెసేజ్‌లు పంపిన వ్యక్తి ఇంటిపై కూడా మృతురాలి బంధువులు దాడి చేశారు. ప్రస్తుతం పోలీసుల భర్తతోపాటు వాట్సాప్ చాట్ చేసిన వ్యక్తి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.