శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 8 మార్చి 2020 (11:24 IST)

లిఫ్ట్ పేరిట కారెక్కించుకుని.. దారి మళ్లించి అత్యాచారం.. ఎక్కడ?

మహిళలపై అకృత్యాలకు ఎన్ని చట్టాలొచ్చినా అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. లిఫ్ట్ పేరుతో ఓ మహిళపై కారులోనే అఘాయిత్యానికి పాల్పడ్డాడో కామాంధుడు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా, చందనవల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ పొరుగూరికి వెళ్లి తిరిగి వస్తూ దారిలో ఆటో కోసం వేచి చూస్తోంది. 
 
అదే సమయంలో కారులో ఆటువైపు వచ్చిన అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ ఆమెను చూసి కారు ఆపాడు. ఊర్లో దింపుతానని ఆమెను నమ్మబలికి ఎక్కించుకుని బయలుదేరాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత దారి మళ్లించి కారులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

అతడి బారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.