శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 8 మార్చి 2020 (10:23 IST)

వృద్ధురాలిని కూడా వదలరా..? పాడి ఆవును మేపుకుంటూ వెళ్తే..?

మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా కామాంధులు కామవాంఛను తీర్చుకునేందుకు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తలదించుకునే ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఒంటరిగా వున్న వృద్ధురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ఎర్రావారిపాళెం, ఉదయ మాణిక్యం పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వృద్ధురాలు (65) భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తోంది. శనివారం తన పాడి ఆవును మేపుతూ.. తనకున్న రెండు ఎకరాల పొలం వద్దకు వెళ్లింది. 
 
ఆమెపై కన్నేసిన అదే గ్రామానికి చెందిన 35ఏళ్ల చిన్నరెడ్డప్ప అనే వ్యక్తి ఆమె వెనకే వెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత అక్కడ నుంచి పారిపోయాడు.

కొంత సమయానికి తేరుకున్న బాధితురాలు ఇరుగుపొరుగు వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.