శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 30 జనవరి 2020 (15:07 IST)

ఆంధ్రాలో పెట్రేగిపోతున్న ఇసుక మాఫియా

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇసుక పాలసీని అమలులోకి తీసుకుని‌‌వచ్చి సామాన్యులకు ఇసుకను సరసమైన ధరలకే అందిస్తూ, ఇసుక అక్రమ రవాణాకు తావులేకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పగడ్భందీ ప్రణాళికను రూపొందించినప్పటికి సంబంధిత అధికారుల నిర్లక్ష్యంగా కారణంగా ఇసుక మాఫియా పెట్రేగిపోతున్న పరిస్థితి శోచనీయంగా మారిన వైనం.
 
చిత్తూరు జిల్లా వరదయ్యపాళ్ళెం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని చెన్నవారి పాళ్యెం కరుణానది పరివాహక ప్రాంతం నుండి ట్రాక్టరుల సాయంతో అర్థరాత్రి గుట్టచప్పుడు కాకుండా యధేచ్చగా ఇసుకను తరలిస్తూ ఇసుకాసురులు జేబులు నింపుకుంటున్నారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఇసుక తరలించే విధానంలో‌ ప్రభుత్వం కొన్ని నిబంధనలు ప్రవేశపెట్టినప్పటికి అవేవీ పాటించాల్సిన అవసరం లేనట్టు ఇసుక రవాణా సాగుతుంది.
 
వరదయ్యపాళ్ళెం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ మీదుగా ఈ ఇసుక రవాణా జరుగుతుండటంతో సంబంధిత అధికారుల పనితీరు ప్రశ్నార్ధకంగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. రక్షణశాఖలోని కొందరి ఇంటిదొంగల సహకారంతోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందనే పలు అంశాలను స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు నిద్రావస్థలో నుండి మేల్కోని నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఇసుక దందాకు అడ్డుకట్టవేయాలని స్థానికులు కోరుతున్నారు.