సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 జనవరి 2020 (09:18 IST)

వైజాగ్‌లో కరోనా కలకలం : వ్యాప్తి చెందకుండా చర్యలు

చైనాతో పాటు పలు దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ ఇపుడు సముద్రతీర ప్రాంతమైన విశాఖపట్టణంకు కూడా వ్యాపించినట్టు వదంతులు వస్తున్నాయి. దీంతో విశాఖ యంత్రాంగంతో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టారు. 
 
ఇప్పటికే ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం, పౌర విమానయాన శాఖ తీసుకుంటున్న విషయం తెల్సిందే. ఈ చర్యల్లో భాగంగా, వైజాగ్ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్ పోర్టులో కాలుమోపే ప్రయాణికులు, ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే వారిని పరిశీలించేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 
 
ఈ కేంద్రానికి కరోనా వైరస్ ఇప్పటికే సోకిన దేశాల నుంచి వచ్చే వారికి ప్రత్యేక పరీక్షలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద ప్రయాణికుల అవగాహన కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. చైనా, దుబాయ్, మలేషియా, సింగపూర్ నుంచి నగరానికి వస్తున్న వారిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, వారిలో ఎటువంటి కరోనా లక్షణాలు లేకుంటేనే నగరంలోకి పంపుతున్నామని అధికారులు వెల్లడించారు.